Jersey Hindi: సోషల్​ మీడియా ట్రెండింగ్​లో బాలీవుడ్ జెర్సీ ట్రైలర్​

Jersey Hindi: నాని హీరోగా క్రికెట్ బ్యాక్​డ్రాప్​లో తెరకెక్కిన జెర్సీ సినిమా ఎంత హిట్​ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఇప్పుడు ఈ సినిమా రీమేక్​గా షాహిద్​ కపూర్​ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో హిందీలో రూపొందిస్తున్నారు. ఇక్కడ కూడా జెర్సీ అనే టైటిల్​ పెట్టారు. ఇఁదులో మృణల్​ ఠాకూర్​, పంకజ్​ కపూర్​ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు దిల్​రాజు, సూర్య దేవర నాగ వంశీ, అమన్ గిల్​ సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అల్లు అరవింద్ […]

Written By: Raghava Rao Gara, Updated On : November 29, 2021 11:08 am
Follow us on

Jersey Hindi: నాని హీరోగా క్రికెట్ బ్యాక్​డ్రాప్​లో తెరకెక్కిన జెర్సీ సినిమా ఎంత హిట్​ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఇప్పుడు ఈ సినిమా రీమేక్​గా షాహిద్​ కపూర్​ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో హిందీలో రూపొందిస్తున్నారు. ఇక్కడ కూడా జెర్సీ అనే టైటిల్​ పెట్టారు. ఇఁదులో మృణల్​ ఠాకూర్​, పంకజ్​ కపూర్​ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు దిల్​రాజు, సూర్య దేవర నాగ వంశీ, అమన్ గిల్​ సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా రానుంది.

కాగా ఇటీవలే ఈ సినిమాకు సంబందించిన ప్రచార చిత్రాలు, వీడియోలు నెట్టింట విడుదలై ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్​ విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్​కు ప్రస్తుతం భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు 50 మిలియన్స్ పైగా వ్యూస్​ను దక్కించుకుంది ఈ ట్రైలర్​.. దీంతో పాటు, 852కేకి పైగా లైక్స్ సాధించింది. ఈ సినిమాను డిసెంబరు 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం.

తెలుగులో నాని హీరో కాగా.. అందులో నాని నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. తండ్రి కొడుకుల డ్రమాతో పాటు, భార్య భర్తల ప్రేమ, మధ్యతరగతి కుటుంబాల కష్టాలు, ఇలా ప్రతి చిన్న ఎలివేషన్​ను మిస్​ చేయకుండా ప్రేక్షకులను కట్టిపడేసేలా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు రీమేక్​గా వస్తోన్న హిందీ జెర్సీ.. ప్రేక్షకులను ఏ మాత్రం అలరిస్తుందో చూడాలి.