Celebrities Chose Surrogacy Parenthood: కాలం మారుతోంది అంటే ఏమో అనుకున్నాం గానీ.. చివరకు పిల్లల్ని కనడం కూడా చాలామందికి పెద్ద ఇబ్బందిగానే మారుతోంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల్లో చాలామంది సరోగసి ద్వారా పిల్లల్ని కంటున్నారు. ఇలా పిల్లల్ని పొందిన వారెవరో ఇప్పుడు చూద్దాం. పోర్న్ స్టార్ సన్నిలియోన్ ఒక కూతురును దత్తత తీసుకున్న తర్వాత.. మిగతా పిల్లల కోసం సరోగసిని వినియోగించుకుంది. సరోగసి ద్వారా కవల పిల్లలు నోహ్, ఆషర్ పుట్టారు.
బాలీవుడ్ స్టార్ హీరో అయిన అమీర్ ఖాన్ రెండో భార్య కిరణ్ రావు దంపతులకు సరోగసి ద్వారా ఆజాద్ రావ్ అనే కొడుకు పుట్టాడు. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతులకు కూడా మూడో కొడుకు అబ్రామ్ ఖాన్ సరోగసి ద్వారా పుట్టాడు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. బాలీవుడ్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ఫరాఖాన్, శిరీష్ కుందర్ దంపతులకు ప్రస్తుతం ముగ్గురు పిల్లలు. వీరంతా కూడా సరోగసి ద్వారా పుట్టిన వారే. ఇందులో ఇద్దరు ఆడపిల్లలు అన్య, దివా ఉంగా.. సిజర్ కుందర్ అనే అబ్బాయి ఉన్నారు.

మరో బాలీవుడ్ యాక్టర్ తుషార్ కపూర్ కొడుకు లక్ష్య. వాస్తవానికి తుషార్ కపూర్‌కు పెండ్లి కాలేదు. కానీ అతను ఓ బిడ్డను కనాలని అనుకున్నాడు. ఇందుకోసం సరోగసిని ఎంచుకున్నాడు. అలా ఓ కొడుకును కన్నాడు. ఇదే తుషార్ కపూర్ అక్క అయిన ఏక్తా కపూర్ కూడా సరోగసితోనే బిడ్డను కన్నది. వీరిద్దరి సరోగసి మదర్ ఒక్కరే.
Also Read: KGF-2 Trailer Creates Record In Telugu: తెలుగులోనే ఎక్కువ సత్తా చాటుతున్న `కేజీఎఫ్ 2`

బాలివుడ్ దిల్ రాజు అయిన కరణ్ జోహార్ కూడా ఈ సరోగసినే ఎంచుకన్నాడు. అతనికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారే రూహి, యశ్. ఈ ఇద్దరూ కూడా సరోగసి ద్వారా పుట్టిన వారే. కరణ్ కూడా ఇప్పటి వరకు పెండ్లి చేసుకోలేదు. అతను కూడా సింగిల్ పేరెంట్ గానే ఉన్నాడు. కేవలం బాలివుడ్ సెలబ్రిటీలే కాదండోయ్.. టాలీవుడ్ లో కూడా ఇలా సరోగసి ద్వారా పిల్లల్ని కన్న వారు ఉన్నారు.

ఇందులో ముఖ్యంగా చెప్పుకుంటే మంచు లక్ష్మీ ఉన్నారు. ఆమె ఏకైక కుమార్తె అయిన విద్యానిర్వాణ సరోగసి ద్వారా పుట్టిన పిల్ల. ఆమె గుజరాత్‌కు చెందిన ఓ సరోగసి మదర్ ద్వారా ఆ బిడ్డను కన్నది. ఇలా సినీ సెలబ్రిటీలు పిల్లల్ని కనడానికి కొన్ని సమస్యలు అడ్డు వచ్చి ఇలా సరోగసిని ఎంచుకుంటున్నారు. ఇంకొందరేమో తమ ఫిజిక్ ఎక్కడ దెబ్బ తింటుందో అనే కారణంగా పిల్లల్ని కనకుండా సరోగసిని నమ్ముకుంటున్నారు. సరోగసి అంటే భార్య అండాన్ని, భర్త వీర్యాన్ని ప్రైవేటుగా ఫలదీకరణ చెందేలా చేసి, పిండంగా మార్చుతారు. దాన్ని వేరే మహిళ గర్భంలోకి ప్రవేశ పెట్టి పిల్లల్ని కనడాన్ని సరోగసి అంటారు

Also Read: Nithin Macherla Niyojakavargam: బర్త్ డే నాడు కత్తి పట్టి వెంటాడిన హీరో ‘నితిన్’
[…] […]
[…] Also Read: Celebrities Chose Surrogacy Parenthood: సరోగసి ద్వారా పిల్ల… […]