https://oktelugu.com/

KGF-2 Trailer Creates Record In Telugu: తెలుగులోనే ఎక్కువ సత్తా చాటుతున్న `కేజీఎఫ్ 2`

KGF-2 Trailer Creates Record In Telugu: `కేజీఎఫ్ చాప్టర్- 2` ట్రైలర్ 24 గంటల్లోనే 109 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డుల మోత మోగించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ట్రైలర్ 24 గంటల్లో.. తెలుగులో 20 మిలియన్ల వ్యూస్ ను, కన్నడలో 18 మిలియన్ల వ్యూస్ ను, తమిళ్‌లో 12 మిలియన్ల వ్యూస్ ను, మలయాళంలో 8 మిలియన్ల వ్యూస్ ను సాధించింది. అయితే, కేజీఎఫ్ ఒక కన్నడ సినిమా. అలాంటిది.. ఈ సినిమా […]

Written By:
  • Shiva
  • , Updated On : March 30, 2022 / 02:47 PM IST
    Follow us on

    KGF-2 Trailer Creates Record In Telugu: `కేజీఎఫ్ చాప్టర్- 2` ట్రైలర్ 24 గంటల్లోనే 109 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డుల మోత మోగించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ట్రైలర్ 24 గంటల్లో.. తెలుగులో 20 మిలియన్ల వ్యూస్ ను, కన్నడలో 18 మిలియన్ల వ్యూస్ ను, తమిళ్‌లో 12 మిలియన్ల వ్యూస్ ను, మలయాళంలో 8 మిలియన్ల వ్యూస్ ను సాధించింది. అయితే, కేజీఎఫ్ ఒక కన్నడ సినిమా.

    KGF-2 Trailer Creates Record In Telugu

    అలాంటిది.. ఈ సినిమా ట్రైలర్ కు కన్నడ భాషలో కంటే వేరే భాషల్లోనే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. హిందీ తర్వాత తెలుగులోనే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. తెలుగులో 2.51 కోట్ల వ్యూస్, 8.54 లక్షల లైక్స్ రాగా కన్నడలో 2.23 కోట్ల వ్యూస్, 8.49 లక్షల లైక్స్ వచ్చాయి. అన్ని భాషలు కలిపి 10 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. హిందీ సంగతి పక్కన పెడితే.. కన్నడ కంటే తెలుగులో ఎక్కువ వ్యూస్ రావడం విశేషమే.

    Also Read: Nithin Macherla Niyojakavargam: బర్త్ డే నాడు కత్తి పట్టి వెంటాడిన హీరో ‘నితిన్’

    దీంతో ‘రికార్డ్స్.. రికార్డ్స్.. రికార్డ్స్.. రాఖీకి ఇది ఇష్టం ఉండదు. కానీ రికార్డ్స్ రాఖీని ఇష్టపడతాయి’ అని మళ్ళీ రుజువు అయ్యింది. మొత్తానికి ట్రైలర్ లో అదనపు హంగులు కోరుకుంటారనే మేకర్స్ అన్ని ఎమోషన్స్ తో పాటు యాక్షన్ అండ్ అద్భుత విజువల్స్ ను నింపేశారు. మొదటి పార్ట్ అధ్యాయం ముగిసిన పాయింట్‌ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది.

    రాఖీ, అధిరా మరియు రమికా సేన్ మధ్య జరిగిన డ్రామా తాలూకు ఎలివేషన్ షాట్స్ అండ్ బిల్డప్ షాట్స్ అదిరిపోయాయి. ట్రైలర్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. ముఖ్యంగా యశ్ చెప్పిన డైలాగ్ లు చాలా బాగున్నాయి. ఇక ఈ కథలోని కీలక సంఘటనల గురించి ప్రకాష్ రాజ్ ఎలివేట్ చేసిన విధానం కూడా బాగుంది. మొత్తమ్మీద ఈ ట్రైలర్ ప్రేక్షకులపై గట్టి ముద్రనే వేసింది.

    KGF-2 Trailer Creates Record In Telugu

    షార్ప్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎలాగూ మొదటి పార్ట్ బంపర్ హిట్ కావడంతో ఈ చిత్రం కోసం అన్ని భాషలలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇంతకీ కేజీఎఫ్ అనగా కోలార్ బంగారు గ‌నులు. కోలార్ బంగారు గ‌నుల నేపథ్యంలో మాఫియా క‌థతో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

    పైగా మొదటి పార్ట్ ను మించి అనేక ప్రత్యేకతలు కెజిఎఫ్ 2లో ఉండబోతున్నాయి. విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నాడు. అలాగే రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటులు కీలక రోల్స్ లో కనిపించబోతున్నారు. అన్నిటికిమించి దర్శకుడు ప్రశాంత్ నీల్ టేకింగ్ పై అందరికీ రెట్టింపు నమ్మకం క్రియేట్ అయింది.

    Also Read: Hero Nithin Birthday Special: హ్యాపీ బర్త్ డే నితిన్… తెలంగాణ రెండో కథానాయకుడు

    Tags