https://oktelugu.com/

Tollywood Heroes Wives: టాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు పోటీగా సంపాదిస్తున్న వారి భార్య‌లు వీరే.. టాప్‌లో ఆమెనే.

Tollywood Heroes Wives: టాలీవుడ్ లో చాలామంది భ‌ర్త‌లు హీరోలుగా రాణిస్తున్నారు. అయితే వారి భార్య‌లు కొంద‌రు సినిమా రంగంలో రాణిస్తుంటే.. మ‌రికొంద‌రు మాత్రం ఇత‌ర రంగాల్లో రాణిస్తూ.. సంపాద‌న‌లో భ‌ర్త‌ల‌కు పోటీ ఇస్తున్నారు. ఇలా టాలీవుడ్ లో ఎవ‌రెవ‌రు భ‌ర్త‌ల‌కు పోటీ ఇస్తున్నారో ఒక‌సారి చూద్దాం. ఇందులో ముఖ్యంగా ఓ ఏడుగురు భార్య‌లు త‌మ భ‌ర్త‌ల‌తో పోటీప‌డి సంపాదిస్తున్నారు. మొద‌టగా చెప్పుకోవాల్సింది రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న గురించి. ఈమె అపోలో హాస్పిట‌ల్స్ వైస్ చైర్మన్ […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 30, 2022 / 03:23 PM IST
    Follow us on

    Tollywood Heroes Wives: టాలీవుడ్ లో చాలామంది భ‌ర్త‌లు హీరోలుగా రాణిస్తున్నారు. అయితే వారి భార్య‌లు కొంద‌రు సినిమా రంగంలో రాణిస్తుంటే.. మ‌రికొంద‌రు మాత్రం ఇత‌ర రంగాల్లో రాణిస్తూ.. సంపాద‌న‌లో భ‌ర్త‌ల‌కు పోటీ ఇస్తున్నారు. ఇలా టాలీవుడ్ లో ఎవ‌రెవ‌రు భ‌ర్త‌ల‌కు పోటీ ఇస్తున్నారో ఒక‌సారి చూద్దాం. ఇందులో ముఖ్యంగా ఓ ఏడుగురు భార్య‌లు త‌మ భ‌ర్త‌ల‌తో పోటీప‌డి సంపాదిస్తున్నారు.

    మొద‌టగా చెప్పుకోవాల్సింది రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న గురించి. ఈమె అపోలో హాస్పిట‌ల్స్ వైస్ చైర్మన్ గా ఉన్నారు. అలాగే బి పాజిటివ్ మ్యాగజైన్ కి చీఫ్ ఎడిటర్ గా ఉన్నారు. ఈమె భారీగా సంపాదిస్తోంది. చ‌ర‌ణ్ కంటే కాస్త ఎక్కువే సంపాదిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

    ramcharan upasana

    సూప‌ర్ స్టార్ మహేష్ బాబు భార్య న‌మ్ర‌త AMB మూవీస్ నిర్వాహ‌ణ బాధ్య‌త‌లు చూసుకుంటున్నారు. ఈమె ది హంబుల్ గో అనే బట్టల బిజినెస్ ను ప్రారంభించింది.

    Also Read: KGF-2 Trailer Creates Record In Telugu: తెలుగులోనే ఎక్కువ సత్తా చాటుతున్న `కేజీఎఫ్ 2`

    mahesh babu namrata

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూడా బాగానే సంపాదిస్తోంది. ఆమె స్పెక్ట్రమ్ అనే మ్యాగజైన్ కి చీఫ్ ఎడిటర్ గా ప‌నిచేస్తోంది. దాంతో పాటు తన తండ్రికి సంబంధించిన సెయింట్ ఇన్ స్టిట్యూట్ బాద్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తోంది. వీటి ద్వారా బాగానే ఆర్జిస్తోంది.

    allu arjun sneha reddy

    ఇక నాచుర‌ల్ స్టార్ నాని భార్య అంజన గురించి చాలా త‌క్కువ మందికి తెలుసు. ఆమె మొద‌టి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఉంది. ఇప్పుడు సినిమా రంగంలో కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తోంది. బాహుబలి సిరీస్ కు కూడా ఆమెనే కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా చేసింది. వీటి ద్వారా ఆమె బాగానే సంపాదిస్తోంది.

    nani wife anjana

    హీరో, డైరెక్ట‌ర్ రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి సింగర్ గా చాలా ఫేమ‌స్‌. ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా బాగానే రాణిస్తోంది. స్టార్ హీరోయిన్ స‌మంత‌కు అన్ని సినిమాల్లో ఆమెనే డబ్బింగ్ చెబుతోంది.

    rahul ravindran Wife chinmayi

    అల్ల‌రి నరేష్ భార్య గురించి కూడా చాలా త‌క్కువ మందికి తెలుసు. కానీ ఆమె చాలా ట్యాలెంట్ ప‌ర్స‌న్. పెండ్లికి ముందు నుంచే ఆమె హైద‌రాబాద్ లో టాప్ మోస్ట్ ఈవెంట్ మేనేజర్ గా రాణిస్తోంది. పెద్ద కుటుంబాలలో జ‌రిగే పెళ్లి వేడుక‌ల‌ను ఆమెనే నిర్వ‌హిస్ంది.

    allari naresh

    ఇక యాక్ట‌ర్ రాజీవ్ కనకాల భార్య సుమ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఆమె టాలీవుడ్ లో స్టార్ యాంక‌ర్ గా దూసుకుపోతోంది. పెద్ద సినిమాల‌న్నింటికీ ఆమెనే హోస్ట్ గా చేస్తోంది. దీంతో పాటు ఆమెకు సొంత ప్రొడ‌క్ష‌న్ హౌస్ కూడా ఉంది. అది కూడా సక్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. ఇలా సెల‌బ్రిటీల భార్య‌లు భ‌ర్త‌ల‌కు పోటీ ఇస్తున్నార‌న్న‌మాట‌

    suma and rajiv kanakala

    Also Read: Celebrities Chose Surrogacy Parenthood: స‌రోగ‌సి ద్వారా పిల్ల‌ల్ని క‌న్న సెల‌బ్రిటీలు వీరే.. టాలీవుడ్ లో ఎవ‌రెవ‌రంటే..?

    Tags