Positive Talk Flop Movies: పాజిటివ్ టాక్ తో అట్టర్ ఫ్లాప్ అయిన టాప్ 5 సినిమాలివీ

ఖలేజా: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటి వరకు రెండు సినిమాల్లో ఒకటి అతడు కాగా.. మరొకటి ఖలేజా.. అతడు త్రివిక్రమ్ తో పాటు మహేష్ బాబు కెరీర్ ను మలుపు తిప్పింది.

Written By: Srinivas, Updated On : June 5, 2023 9:38 am

Positive Talk Flop Movies

Follow us on

Positive Talk Flop Movies: నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రతీ సినిమా హిట్టవుతుందని చెప్పలేం. కొన్ని సక్సెస్ కావొచ్చు.. మరికొన్ని డిజాస్టర్ కావొచ్చు.. ఒక్కోసారి చిత్రం యూనిట్ ఎంతో కష్టపడి మంచి సినిమాను నిర్మించినా థియేటర్లోకి వెళ్లేసరికి సక్సెస్ కావు. అందుకు కారణం ఏదైనా అప్పటి వరకు సినిమా కోసం కష్టపడ్డవారంతా నిరాశకు గురవుతారు. కానీ వారి పనితనం ఏంటో అర్థమవుతుంది. చాలా సినిమాలు అనుకున్న రేంజ్ లో బ్లాక్ బస్టర్ కాకపోయినా.. సినిమా బాగుంది.. అనే టాక్ తెచ్చుకున్నవి ఉన్నాయి. ఈ విషయం ఆడియన్స్ కు లేట్ గా తెలిసేసరికి ఆ సినిమాను చూసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. టాలీవుడ్ లోని అలాంటి సినిమాల గురించి తెలుసుకుందాం.

ఖలేజా: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటి వరకు రెండు సినిమాల్లో ఒకటి అతడు కాగా.. మరొకటి ఖలేజా.. అతడు త్రివిక్రమ్ తో పాటు మహేష్ బాబు కెరీర్ ను మలుపు తిప్పింది. ఇదే ఊపులో వీరి కాంబినేషన్లో ఖలేజా మూవీని తీశారు. అయితే ఈ సినిమాను మొదట్లో ఎవరూ ఆదరించలేదు. వాస్తవానికి కొన్ని రోజుల వరకు ఈ సినిమా అర్థం కాలేదు. కానీ రాను రాను సినిమాకు ఆదరణ పెరిగింది. ఇప్పుడు ఖలేజా సినిమా టీవీల్లో వస్తే తప్పకుండా చూస్తున్నారు.

ప్రస్థానం: శర్వానంద్ హీరోగా నటించిన పవర్ ఫుల్ మాస్ మూవీ ప్రస్థానం. దేవకట్టా అనే డైరెక్టర్ తెరకెకక్కించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రేక్షకులు కూడా బాగుంది అని రేటింగ్ ఇచ్చారు. కానీ కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఇందులో సాయికుమార్ కూడా తన నటనా భీభత్సాన్ని సృష్టించాడు.

నేనొక్కడినే: లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన డిప్లొమాటిక్ మూవీ ‘నేనొక్కడినే’. మహేష్ తో కలిసి తీసిన ఈమూవీ పై ముందుగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ ఇదివరకు అలాంటి సినిమా ఎప్పుడూ చేయలేదు. దీంతో ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని అనుకున్నారు. కానీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే సినిమా స్టోరీ చాలా మందికి నచ్చడంతో టీవీల్లో పలుసార్లు వేస్తుంటారు.

ఆరేంజ్: మెగా హీరో రామ్ చరణ్ హీరోగా వచ్చిన లవ్ ఎంటర్టైనర్ ఆరేంజ్.. ముందుగా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. కానీ భారీ డిజాస్టర్ ను నమోదు చేసుకుంది. ఈ సినిమాకు నిర్మాతగా ఉన్న నాగబాబు ఈ సినిమాతో తీవ్ర నిరాశ చెందినట్లు సమాచారం. అయతే క్లాసికల్ మూవీ లిస్టులో ఆరేంజ్ చేరింది. లవ్ కపుల్స్ ఎక్కువగా ఈ సినిమాను ఆదరిస్తూ ఉంటారు.

జగడం: సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన భారీ యాక్షన్ మూవీ జగడం. రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఈ సినిమా స్టోరీ బాగానే ఉంటుంది. కానీ కొన్ని సీన్స్ స్థాయికి మించి ఉండడంతో డిజాస్టర్ గా మిగిలింది. అయితే లవ్ ఎంటర్టైన్ కోరుకునేవాళ్లు ఈ సినిమాను ఆదరిస్తున్నారు.