TV channels TRP Ratings: ఒకప్పుడు ఈటీవీ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో దుమ్ము రేపేది. సీరియల్స్, పాతకాలపు సినిమాలతో సంచలనం సృష్టించేది. అన్వేషిత, అంతరంగాలు, వసుంధర, శాంతినివాసం, మనో యజ్ఞం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బెంచ్ మార్క్ సీరియల్స్ నిర్మించి సరికొత్త చరిత్ర సృష్టించింది ఈటీవీ. కానీ ఇప్పుడు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అనే బూతు షో లతో నెట్టు కొస్తోంది. ఎంతో సాధన సంపత్తి ఉన్నప్పటికీ ఈటీవీ ఇలా దిగజారి పోవడాన్ని సగటు తెలుగు ప్రేక్షకుడు జీర్ణించుకోలేకపోతున్నాడు.
అరవ ప్రాంతానికి చెందిన కళానిధి మారన్ ఏర్పాటుచేసిన జెమినీ ఛానల్ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఒకప్పుడు ఈటీవీతో పోటీపడేది. కొంతకాలానికి ఈటీవీని దాటేసింది. అయితే రాను రాను రాజుగారిగుర్రం గాడిద అయినట్టు.. జెమినిటీవీ పరిస్థితి కూడా అలానే మారిపోయింది. కేవలం సినిమాలను మాత్రమే నమ్ముకుని ఇతర కార్యక్రమాలను పట్టించుకోవడం మానేసింది. దీంతో ప్రేక్షకులు కూడా జెమినిని పట్టించుకోవడం మానేశారు. ఫలితంగా అగ్రస్థానంలో ఉన్న ఆ ఛానల్ పరిస్థితి ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక మొదటి స్థానంలో స్టార్ మా కొనసాగుతోంది. ఈ ఛానల్ ఏం చేస్తుందో తెలియడం లేదు.. రేటింగ్స్ లో మాయ చేస్తోందా.. ఇంకా ఏమైనా జిమ్మిక్కులు చేస్తుందా అర్థం కావడం లేదు కానీ.. తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. తాజాగా విడుదలైన రేటింగ్స్ ప్రకారం మా టీవీ కి 2540.09 రేటింగ్స్ వచ్చాయి. దీంతో ఆ ఛానల్ మరోసారి తన స్థాయిని నిరూపించుకుంది. రెండో స్థానంలో జీ తెలుగు కొనసాగుతోంది. జీ తెలుగు 1592.2 రేటింగ్స్ తో రెండవ స్థానంలో ఉంది. ఈటీవీ తెలుగు 843.44 రేటింగ్స్ తో మూడో స్థానంలో కొనసాగుతోంది. జెమిని టీవీ 673.95 రేటింగ్స్ తో నాలుగు స్థానంలో ఉంది. యాదృచ్ఛికంగా ఐదో స్థానంలో స్టార్ మా మూవీస్ రావడం విశేషం. ఈ ఛానల్ ఏకంగా 633.45 రేటింగ్స్ సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ప్రో కబడ్డీ లీగ్ నడుస్తోంది. దానిని మా గోల్డ్ లో స్టార్ గ్రూప్ లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. అయినప్పటికీ ఆ ఛానల్ కంటే స్టార్ మాను చూసేవారే ఎక్కువగా ఉన్నారు. చివరికి రిపీటెడ్ సినిమాలయితే స్టార్ మా మూవీస్ ఛానల్ ను కూడా తెలుగు ప్రేక్షకులు విపరీతంగా చూస్తున్నారు. స్టార్ మా లో కార్తీకదీపం -2 తిరుగులేని స్థాయిలో ఉంది. అట తిప్పి ఇటు తిప్పి.. సాగదిత కొనసాగిస్తున్నప్పటికీ కార్తీకదీపాన్నే తెలుగు ప్రేక్షకులు విపరీతంగా చూస్తున్నారు. ఆ తర్వాత ఇల్లు ఇల్లాలు పిల్లలు, ఇంటింటి రామాయణం, చిన్ని వంటి సీరియల్స్ ఉన్నాయి. స్టార్ మా గ్రూప్ ఎంతో గొప్పగా చెప్పుకొని ప్రచారం చేసుకున్న బిగ్ బాస్, ఇతర రియాల్టీ షోలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. అయినప్పటికీ స్టార్ మా కు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఆ ఛానల్ రేటింగ్స్ ప్రకారం చూసుకుంటే శిఖరాగ్రంలో ఉంది. దానిని మిగతా చానల్స్ అందుకోవాలంటే అంత ఈజీ కాదు.. ఇప్పటికైతే రేటింగ్స్ ఇవి.. వచ్చే రోజుల్లో ఇవి మారినప్పటికీ స్టార్ మా ప్రస్థానం మాత్రం మారదు. ఎందుకంటే ఇప్పుడు అందులోకి ముకేశ్ అంబానీ కంపెనీ కూడా వచ్చి చేరింది. ఆర్థికంగా బలం.. క్రియేటివిటీ పరంగా కూడా బలం.