Bigg Boss 9 Telugu Captain: ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన అన్ని బిగ్ బాస్ సీజన్స్ లో ప్రతీ వారం ఇంటికి కేవలం ఒక్క కెప్టెన్ మాత్రమే ఉండడం చూశాం. కానీ తెలుగు బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) లో మొట్టమొదటిసారి ఇద్దరు కెప్టెన్స్ ని ఈ వారం లో మనం చూడబోతున్నాము. ఆ ఇద్దరు మరెవరో కాదు, సుమన్ శెట్టి మరియు గౌరవ్ గుప్తా. వీళ్లిద్దరు కలిసి ఒక జట్టుగా గేమ్స్ ఆడి, ఇంటికి కెప్టెన్స్ అయిపోయారు. ఇద్దరూ ఇద్దరే, ఒకరికి తెలుగు రాదు, ఇంకొకరికి లీడర్ షిప్ స్కిల్స్ లేవు. వీళ్లిద్దరు కలిసి ఒక వారం పాటు హౌస్ ని ఎలా మ్యానేజ్ చేస్తారో చూడాలి. పైగా ఈ సీజన్ లో గొడవలు పెట్టుకునే కంటెస్టెంట్స్ ఎక్కువ, ముఖ్యంగా రేషన్ విషయం లో, అదే విధంగా హౌస్ క్లీనింగ్ విషయం లో పెద్ద గొడవలు జరుగుతుంటాయి. వాటిని ఈ అమాయకులిద్దరూ ఎలా మ్యానేజ్ చేస్తారో చూడాలి.
ఇంతకీ వీళ్లిద్దరు ఎలా కెప్టెన్స్ అయ్యారో ఒకసారి చూద్దాం. నిన్నటి ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్స్ అందరినీ బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీ దారుణాలను చేస్తాడు. వాళ్ళకే ఎవరితో పోటీ పడాలని కోరుకుంటున్నారో ఎంచుకోండి అనే ఛాయస్ కూడా ఇచ్చారు. వాళ్ళు భరణి, తనూజ, సుమన్ శెట్టి, దివ్య, సంజన లను ఎంచుకున్నారు. భరణి టీం కోసం చాలా గట్టిగా ఆడాడు కానీ, అవతల టీం లో సభ్యుల సంఖ్య ఎక్కువ, పైగా అందరూ ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల గెలవడం కష్టమైంది. ముఖ్యంగా రమ్య భరణి ఆపడం లో సక్సెస్ అయ్యింది. అంతటి బలమైన స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని ఆపి, చివరి వరకు ఈడ్చుకొని వెళ్ళింది. తొలి రౌండ్ వైల్డ్ కార్డ్స్ గెలిచి, బలమైన కంటెస్టెంట్ అయినటువంటి భరణి ని పోటీ నుండి తప్పించారు. భరణి ఎలిమినేట్ అయినప్పుడే ఈ టాస్క్ వైల్డ్ కార్డ్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది.
రెండవ రౌండ్ కూడా వాళ్ళే గెలిచి దివ్య ని తప్పిస్తారు, ఆ తర్వాత సంజన ని, చివర్లో తనూజ ని తప్పించగా, ఇక మిగిలింది సుమన్ శెట్టి మాత్రమే. అలా వీక్ కంటెస్టెంట్ గానే సుమన్ శెట్టి కెప్టెన్సీ పోటీ దారుడిగా నిల్చి చివరి రౌండ్ లోకి అడుగుపెట్టాడు. చివరి రౌండ్ లో బిగ్ బాస్ అందరినీ జతగా ఏర్పడి ఆడమని ఆదేశిస్తాడు. అలా సుమన్ శెట్టి, గౌరవ్ లు జత కలుస్తారు. చివరి టాస్క్ గెలిచి ఇంటికి కెప్టెన్స్ గా మారుతారు. ఎలాంటి టాస్క్ ఆడారు అనేది నిన్నటి ఎపిసోడ్ చివర్లో వేసిన ప్రోమో లో మనమంతా చూసాము. సేవపేటిక లో తమ పార్టనర్స్ ఉంటారు. వాళ్ళని విడిపించాలి. ఎవరైతే ముందుగా విడిపిస్తారో,వాళ్ళే ఈ టాస్క్ లో గెలిచినట్టు. అందరికంటే ముందు సుమన్ శెట్టి ని బయటకు వస్తాడు. పూర్తి టాస్క్ చూడాలంటే రాత్రి వరకు ఆగాల్సిందే.