Top 5 Telugu Directors: ఇండియాలో చాలామంది దర్శకులు గొప్ప సినిమాలను చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ దర్శకులు మాత్రమే టాప్ పొజిషన్ ను దక్కించుకునేవారు. భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టే సినిమాలను వాళ్ళు మాత్రమే చేసి ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్లుగా కొనసాగుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరు మంచి సినిమాలు చేస్తూ గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఇండియాలో ఉన్న టాప్ 5 డైరెక్టర్లలో ఎవరెవరు ఉన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతమంది టాప్ 5 లో స్థానాన్ని సంపాదించుకున్నారు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం…
ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన చేసిన ‘బాహుబలి’ సిరీస్ అలాగే ‘త్రిబుల్ ఆర్’ సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి. ఈ సినిమాలతో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాతో 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక తనను బీట్ చేసే దర్శకుడు మరెవరు లేకపోవడంతో ప్రస్తుతానికైతే ఆయన నెంబర్ వన్ పొజిషన్ ను కైవసం చేసుకున్నాడు…
నెంబర్ 2 లో సుకుమార్ ఉండడం విశేషం…’పుష్ప 2′ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన బాలీవుడ్ ప్రేక్షకులను సైతం మంత్ర ముగ్ధుల్ని చేశాడు. ఇక మొత్తానికైతే అతనికి అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయిందనే చెప్పాలి…
నెంబర్ 3 లో ప్రశాంత్ నీల్ ఉండడం విశేషం…కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ దర్శకుడు పాన్ ఇండియాను షేక్ చేశాడు. మొత్తానికైతే ఇండియాలో ఉన్న దర్శకులలో ప్రశాంత్ నీల్ టాప్ 3 లో నిలవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
నెంబర్ ఫోర్ లో నాగ్ అశ్విన్ నిలిచాడు. కల్కి సినిమాతో 1100 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టిన ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మీద చెరగని ముద్ర వేశాడు…
నెంబర్ 5 లో సందీప్ రెడ్డి వంగ ఉన్నాడు. సందీప్ చేసిన అనిమల్ సినిమా 950 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. దాంతో అతను ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. మొత్తానికైతే టాప్ 5 లో అతను చోటు సంపాదించుకోవడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమాలో చేస్తున్నాడు ఈ సినిమాతో 2500 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అది కనక సాధ్యమైతే మాత్రం ఇండస్ట్రీలో తను నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ఇక టాప్ 3 లో ఇద్దరు తెలుగు డైరెక్టర్స్ ఉన్నారు. అలాగే టాప్ 5 లో 4 తెలుగు డైరెక్టర్లకు చోటు దక్కింది…