South Indian Movies: భారత సినీ పరిశ్రమ తీరు మారుతోంది. గతంలో బీటౌన్ నెంబర్ 1 ఇండస్ట్రీగా కొనసాగేది. ఇలాంటి సమయంలో బాలీవుడ్ లో నటించే అవకాశం వస్తే లైఫ్ సెటిల్ అయినట్లేనని చాలా మంది నటులు అనుకునేవారు. అందుకోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ఆ సమయంలో సౌత్ వాళ్లను చాలా చిన్న చూపు చూసేవారు. కానీ ఇప్పుడు ఇక్కడి సినిమాల హవా సాగుతోంది. విభిన్న కథలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలు తీస్తున్న సౌత్ డైరెక్టర్లను చూసి హిందీ మేకర్స్ షాక్ ఇస్తున్నారు. దీంతో కొందరు బాలీవుడ్ బిగ్ స్టార్లు సైతం సౌత్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్టు పెడుతున్నారు. కమర్షియల్ పరంగా కూడా సౌత్ సినిమా రికార్డులు నెలకొల్పుతోంది. భారీ బడ్జెట్ తో పాటు ఎక్స్ పెక్ట్ చేయని కలెక్షన్లు వసూలు కావడంతో ఇప్పుడంతా సౌత్ ఇండస్ట్రీపైనే ఫోకస్ పెట్టారు.గత రెండేళ్లుగా సౌత్ నుంచి రిలీజైన సినిమాలు అత్యధిక కలెక్షన్లు చేసి ఔరా అనిపించాయి. వాటిలో 10 సినిమాల గురించి మీకోసం.
1. బాహుబలి (ది కంక్లూజన్):
రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి 2 వరల్డ్ వైడ్ షేర్ రూ.812 కోట్లు. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్ ప్రధాన పాత్రలుగా పోషించిన ఈ మూవీ బాహుబలి ది బిగినింగ్ కు సీక్వెన్స్ గా వచ్చింది. ఈ సినిమా కోసం 300 కోట్లు బడ్జెట్ పెట్టగా రూ.812 కోట్లు షేర్ చేసింది. రాజమౌళి సినిమాల్లో ఇదే హైయ్యెస్టు వసూలు చేసిన సినిమాగా రికార్డు నెలకొల్పింది.
2. ఆర్ఆర్ఆర్:
రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఇద్దరూ పోటా పోటీగా నటించిన ఈ మూవీ కి ఇటీవలే ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ సినిమా ప్రపంచం లెవల్లో గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా రికార్డు సాధించింది. ఈ సినిమా టోటల్ షేర్ రూ..654 కోట్లు.
3.కేజీఎఫ్ (చాప్టర్ 2):
కొలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో వచ్చిన కేజీఎఫ్ పార్ట్ వన్ మూవీ విపరీతంగా జనాల్లోకి వెళ్లింది. ఈ ఊపుతో ‘చాప్టర్ 2’ మేకింగ్ చేశారు. హైయ్యెస్ట్ బడ్జెట్ తో తీసిని ఇందులో యశ్ హీరోగా నటించారు. ఆయన ‘రాకీ’ పాత్రలో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా టోటల్ షేర్ రూ. 600 కోట్లు.
4.బాహుబలి (ది బిగినింగ్):
బాహుబలి ఎప్పుడో రాసుకున్న బాహుబలి కథను మొత్తానికి ప్రభాస్ తో తెరకెక్కించారు. అనుకున్నట్లుగానే ఈ మూవీ ఆడియయన్స్ తో బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాలో పెట్టిన సస్పెన్స్ తో బాహుబలి కంక్లూషన్ కోసం ఎదురుచూసేలా చేసింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ షేర్ రూ.301.3 కోట్లు.
5. రోబో 2.0.:
స్టార్ హీరో రజనీకాంత్ 60 పదుల వయసులోనూ రోబోటిక్ లా నటించిన మూవీ ‘రోబో 2.0‘. సినిమా రిలీజైన కొత్తలో ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ కమర్షియల్ గా మాత్రం సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇలా దీని మొత్తం కలెక్షన్లు రూ.295.8 కోట్లు.
6. పొన్నియన్ సెల్వన్:
తమిళ హిస్టారికల్ నేపథ్యంలో వచ్చిన మణిరత్నం లేటేస్ట్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్ (పీఎస్-1). భారీ తారాగణంతో పాటు భారీ బడ్జెట్ తో తీసిన ఈమూవీ రెండు పార్టులుగా తయారు చేశారు. మొదటి పార్ట్ కలెక్షన్లు రూ.238.1 కోట్లు.
7. సాహో:
బాహుబలి భారీ మూవీ తరువాత ప్రభాస్ చేసిన పాన్ ఇండియా మూవీ ‘సాహో’. ఇందులో ప్రభాస్ రహస్య పోలీస్ పాత్రలో నటించారు. అయితే అనుకున్న రేంజ్ లో సినిమా సక్సెస్ కాకపోయినా కమర్షియల్ హిట్టునిచ్చింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా షేర్ చేసింది రూ.214 కోట్లు.
8. విక్రమ్:
కమలహాసన్ భారీ యాక్షన్ తో తీసిన మూవీ విక్రమ్. ఇందులో కమల్ కొత్తగా కనిపించారు. స్వీయ నిర్మాణంలో వచ్చిన ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ రూ.213 కోట్లు.
9. కాంతారా:
సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి సెన్సెషనల్ క్రియేట్ చేసిన కాంతారను ఎవరూ మరిచిపోరు. పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోయిన కాంతార సినిమా కోసం కేవలం రూ.6 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. కానీ ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.189 కోట్లు షేర్ చేసింది.
10. పుష్ప:
సౌత్ నుంచి పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ కొట్టిన మరో మూవీ పుష్ప. ఇప్పుడు దీని సీక్వెల్ మేకింగ్ అవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.184.2 కోట్లు షేర్ చేసింది.