https://oktelugu.com/

Senior Hero Naresh: మల్లెపూలు చూసి పవిత్రతో రొమాంటిక్ మూమెంట్స్ గుర్తు చేసుకున్న నరేష్… అందమైన లోకేషన్ లో రిలాక్స్ అయ్యామంటూ!

అన్నీ మంచి శకునములే ప్రీ రిలీజ్ ఈవెంట్ యాంకర్ గా ఉన్న సుమ నరేష్ మాట్లాడుతుండగా మల్లెపూలు తెచ్చింది. రాజేంద్రప్రసాద్ కి మామిడికాయ ఇచ్చారు. హీరో సంతోష్ కి సోడా ఇచ్చారు. నాకేమో మల్లెపూలు ఇచ్చారు.

Written By:
  • Shiva
  • , Updated On : May 15, 2023 / 12:21 PM IST

    Senior Hero Naresh

    Follow us on

    Senior Hero Naresh: నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అన్నీ మంచి శకునములే’.  సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించారు. మూవీ విడుదలకు సిద్ధం కాగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ చిత్రంలో నరేష్ కీలక రోల్ చేశారు. ఈవెంట్ కి హాజరైన నరేష్ తన స్పీచ్ తో అలరించారు.  నరేష్ మాట్లాడుతూ… అన్నీ మంచి శకునములే చిత్ర షూట్ విక్టోరియాపురంలో జరిగింది. అందమైన లోకేషన్ లో షూటింగ్ చేస్తుంటే నిర్మాతలు మాకు రిలాక్స్ అవమని టైం ఇచ్చారు. అక్కడ నాకు ఒక ఇల్లు ఉంది. పవిత్ర స్వయంగా వంట చేసి తీసుకొచ్చేది. చిత్ర షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాము. నిర్మాతగా ఆలోచిస్తే మాత్రం భయం వేసిందని నరేష్ అన్నారు.

    అన్నీ మంచి శకునములే ప్రీ రిలీజ్ ఈవెంట్ యాంకర్ గా ఉన్న సుమ నరేష్ మాట్లాడుతుండగా మల్లెపూలు తెచ్చింది. రాజేంద్రప్రసాద్ కి మామిడికాయ ఇచ్చారు. హీరో సంతోష్ కి సోడా ఇచ్చారు. నాకేమో మల్లెపూలు ఇచ్చారు.  నేను మందు బాటిల్ ఎక్స్ పెక్ట్ చేశానని నరేష్ అన్నారు. అలాగే మూవీ మంచి విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు.

    నరేష్ ప్రధాన పాత్రలో నటించిన మళ్ళీ పెళ్లి సైతం విడుదలకు సిద్ధమైంది. మే 26న ఈ మూవీ విడుదల కానుంది. పవిత్ర లోకేష్ ఆయనకు జంటగా నటిస్తున్నారు. మళ్ళీ పెళ్లి నరేష్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. నరేష్ మూడో భార్యతో ఏర్పడ్డ విభేదాలు, అనంతరం పవిత్ర లోకేష్ ఎంట్రీ… ఈ ముగ్గురు కేంద్రంగా నడిచిన హైడ్రామా ప్రధానంగా మళ్ళీ పెళ్లి తెరకెక్కించారు. నరేష్ ఇది నా కథ కాదని చెబుతున్నా టీజర్, ట్రైలర్ తో ఫుల్ క్లారిటీ వచ్చింది.

    మూడో భార్య రమ్య రఘుపతి మీద రివేంజ్ తీర్చుకునేందుకే మళ్ళీ పెళ్లి మూవీ చేశారనే వాదన ఉంది. దాన్ని కూడా నరేష్ ఖండించారు. మళ్ళీ పెళ్లి చిత్రానికి ఎమ్ ఎస్ రాజు దర్శకుడు. నరేష్ నిర్మాతగా ఉన్నారు. వనిత విజయ్ కుమార్ కీలక రోల్ చేశారు. శరత్ బాబు, జయసుధ ఇతర పాత్రలు చేశారు. ఈ మూవీ అనేక వివాదాలకు దారి తీయడం ఖాయం. ఫైర్ బ్రాండ్ రమ్య రఘుపతి ఇంకా సీన్లోకి ఎంటర్ కాలేదు. ఆమె ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి.