Top 10 OTT Platforms: ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి సినిమాలు చేసే రోజులు పోయాయి… ఎంతసేపు ఓటీటీ లో సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు తప్ప థియేటర్లోకి వెళ్లాలి అనే ఆలోచన కూడా చేయడం లేదు… దాంతో ఓటీటీ లకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం టాప్ 10 లో ఉన్న ఓటీటీ సంస్థలు ఏంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
నెట్ ఫ్లిక్స్
302 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ లో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ మొత్తాన్ని తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా అందిస్తోంది. కాబట్టి ఈ సంస్థ ఎక్కువ సంఖ్యలో సబ్స్క్రైబర్లను సంపాదించుకుంది…
జియో హాట్ స్టార్
జియో హాట్ స్టార్ సైతం మునుపు ఎన్నడూ లేనివిధంగా 300 మిలియన్ల సబ్స్రైబర్లతో నెట్ ఫిక్స్ కి పోటీని ఇస్తుంది. వీటి మధ్య కేవలం రెండు మిలియన్ల వ్యత్యాసం మాత్రమే ఉండడం వల్ల జియో హాట్స్టార్ ఎప్పుడైనా సరే నెట్ ఫిక్స్ ని బీట్ చేసి ముందుకు వెళ్లే అవకాశం ఉంది. నిజానికి ఒక భారతీయ ఓటిటి సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ముఖ్యంగా హాట్ స్టార్ యొక్క ప్రధాన బలం ఏంటి అంటే ఇండియన్ క్రికెట్ మ్యాచ్ లను టెలికాస్ట్ చేయడం, అలాగే లోకల్ కంటెంట్ ని ఎంకరేజ్ చేస్తూ వాటి స్ట్రీమింగ్ కి అవకాశం కల్పించడం వీటన్నింటి ద్వారా జియో హాట్ స్టార్ నెంబర్ 2 పొజిషన్ కి చేరుకుంది…
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇక ఈ రెండింటి తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో 200 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ తో 3 వ స్థానాన్ని సంపాదించుకుంది.
డిస్నీ ప్లస్
హాట్ స్టార్ వాళ్ళతో విడిపోయి డిస్నీ వాళ్ళు కొత్త ప్లాట్ ఫామ్ ను స్టార్ట్ చేసినప్పటికి వాళ్లకు 132 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.
హెచ్ బి ఏ మ్యాక్స్
ఇండియాలో ఈ సంస్థ పెద్దగా గుర్తింపును సంపాదించుకోకపోయిన ఫారన్ కంట్రీస్ లో మాత్రం ఈ సంస్థకి ఎక్కువ క్రేజ్ ఉంది… 128 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ను సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు…
టెన్సెంట్
ఈ సంస్థకి 110 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ఉన్నారు…
ఐక్యూయి
ఈ ఓట్ సంస్థకి 101 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ఉన్నారు…
పారా మౌంట్ ప్లస్
ఈ సంస్థకి 79 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ఉన్నారు…
హులు 64 మిలియన్లు
పీకాక్ 41 మిలియన్లు