spot_img
Homeఎంటర్టైన్మెంట్Top TRP Movies: బుల్లితెరపై టాప్ టీఆర్పీ రేటింగ్ సాధించిన 10 తెలుగు సినిమాలు ఇవే!

Top TRP Movies: బుల్లితెరపై టాప్ టీఆర్పీ రేటింగ్ సాధించిన 10 తెలుగు సినిమాలు ఇవే!

Top TRP Movies: కొన్ని సినిమాలు వెండితెరపై సత్తా చాటితే మరికొన్ని సినిమాలు బుల్లితెరపై రికార్డు స్థాయిలో రేటింగ్స్ ను సొంతం చేసుకుంటూ ఉంటాయి. ఇప్పటివరకు బుల్లితెరపై ప్రసారమైన సినిమాలలో స్టార్ హీరోల సినిమాలలో చాలా సినిమాలలో మంచి రేటింగ్ ను సొంతం చేసుకున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు బుల్లితెరపై కూడా అద్భుతంగా రేటింగ్స్ ను సొంతం చేసుకుంటాయనే సంగతి తెలిసిందే.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో బన్నీ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమా అంచనాలకు అందని స్థాయిలో ఏకంగా 29.4 రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఈ స్థాయిలో రేటింగ్ సాధించిన మరో సినిమా అయితే లేదనే చెప్పాలి. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఏకంగా 23.4 రేటింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బాహుబలి ది కంక్లూజన్ మూవీ ఏకంగా 22.7 రేటింగ్ ను సొంతం చేసుకుంది.

కొరటాల శివ డైరెక్షన్ లో మహేష్ హీరోగా తెరకెక్కిన శ్రీమంతుడు 22.54 రేటింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. హరీష్ శంకర్ డైరెక్షన్ లో బన్నీ హీరోగా నటించిన డీజే 21.7 రేటింగ్ ను సాధించింది. బాహుబలి ది బిగినింగ్ 21.54 రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఫిదా సినిమా 21.31 రేటింగ్ ను సాధించగా గీతా గోవిందం మూవీ 20.8 రేటింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. జనతా గ్యారేజ్ సినిమా 20.69 రేటింగ్ ను సాధించింది.

మహానటి సినిమా 20.21 రేటింగ్ ను సొంతం చేసుకోగా రంగస్థలం సినిమా 19.5 రేటింగ్ ను సొంతం చేసుకుంది. భరత్ అనే నేను, అత్తారింటికి దారేది. అరవింద సమేత వీర రాఘవ, వకీల్ సాబ్ సినిమాలు కూడా బుల్లితెరపై మంచి రేటింగ్ ను సొంతం చేసుకున్నాయి.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Oktelugu Epaper
Exit mobile version