Most Awaited Movies in 2022: కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ పై చాలా ప్రభావం పడిందని చెప్పాలి. వాస్తవానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూ అభిమానులను ఊరిస్తూనే ఉన్నాయి. ఇలా 2022లో ది మోస్ట్ అవైటెడ్ సినిమాల లిస్టును IMBD రిలీజ్ చేసింది. ఇండియా వ్యాప్తంగా ఇలాంటి సినిమాల్లో మన తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి.

ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా మొదటి స్థానం కేజీఎఫ్ 2 కి ఇచ్చింది ఈ సంస్థ. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో యశ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడిన ఈ మూవీని ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
ఇక రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా పై కూడా ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి. మూడు సార్లు వాయిదా పడ్డ ఈ మూవీ ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అమీర్ ఖాన్ హీరోగా అద్వైత్ చంద్ డైరెక్షన్ లో వస్తున్న లాల్ సింగ్ చద్దా మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో నాగచైతన్య ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

సంజయ్లీలా డైరెక్షన్లో ఆలియా భట్ హీరోయిన్ గా వస్తున్న గంగు భాయ్ కతియా వాడి మూవీ కూడా మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటిగా పేర్కొంది imbd. ఈ సినిమా విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తమిళం హీరో విజయ్ మూవీ బెస్ట్ కోసం కూడా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇది మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఐదో స్థానంలో నిలిచింది.

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో వస్తున్న దాక్డ్ మూవీ మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయని దీని కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారని తెలిపింది ఐఎంబీడీ.
డార్లింగ్ ప్రభాస్ హీరోగా వస్తున్న రాధేశ్యాం మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారని ఈ సినిమాకు ఏడో స్థానాన్ని ఇచ్చింది imbd. అయన్ ముఖర్జీ డైరెక్షన్లో రన్ బీర్ కపూర్, ఆర్య జంటగా నాగార్జున, అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్న బ్రహ్మాస్త్ర మూవీ కోసం ప్రేక్షకులు భారీగా ఎదురుచూస్తున్నారు. ఇక టైగర్ ష్రాఫ్ హీరోగా హీరో పంటి 2 మూవీకి తొమ్మిదో స్థానం, అలాగే ప్రభాస్ హీరోగా వస్తున్న ఆది పురుష్ మూవీకి పదో స్థానాన్ని ఇచ్చింది imbd.