https://oktelugu.com/

Radhe Shyam : ‘రాధేశ్యామ్’ సెన్సార్ పూర్తి అయ్యింది.. నిడివి ఎంతంటే ?

Radhe Shyam : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’. ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు రాధాకృష్ణ ఓ అప్‌డేట్‌ను విడుదల చేశాడు. కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేశారు. ఇక ఈ సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాలుగా ఉంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ మనుషుల చేతి రేఖలు చూసి జాతకం చెప్పే హస్త సాముద్రకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. […]

Written By:
  • Shiva
  • , Updated On : March 6, 2022 / 05:53 PM IST
    Follow us on

    Radhe Shyam : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’. ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు రాధాకృష్ణ ఓ అప్‌డేట్‌ను విడుదల చేశాడు. కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేశారు. ఇక ఈ సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాలుగా ఉంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ మనుషుల చేతి రేఖలు చూసి జాతకం చెప్పే హస్త సాముద్రకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

    Radhe Shyam

    ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలయ్యే థియేటర్స్‌లో జ్యోతిష్కులతో ఒక అస్ట్రాలజీ చెప్పే కౌంటర్స్ కూడా ఓపెన్ చేయబోతున్నారు. అంటే.. సినిమాకు వచ్చే ప్రేక్షకులు ఫ్రీగా జ్యోతిషం చెప్పుంచుకోవచ్చు అన్నమాట. మరి ఈ ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి. ఇక ఓ లవ్‌స్టోరి ఇండస్ట్రీ రికార్డు కొట్టడం చాలా అరుదు. ఇప్పటివరకు మాస్‌, ఫ్యామిలీ చిత్రాలే తెలుగు ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాయి.

    లవ్‌ అండ్‌ రొమాన్స్‌ క్యేటగిరీలో ఇప్పటివరకు ఇండస్ట్రీ రికార్డు కొట్టింది ఖుషీ చిత్రమనే చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్‌ రాధేశ్యామ్‌తో వస్తుండగా, ఖుషీ రికార్డుని బ్రేక్‌ చేసే సత్తా పుష్కలంగా ఉన్నట్టు సినీ వర్గాలు అంటున్నాయి. ఇక రాధేశ్యామ్ కనీసం సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అలాగే టాల్ బ్యూటీ పూజా హెగ్డేకి 4 కోట్లు రెమ్యునరేషన్ ను ఇచ్చారు.

    కాగా కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ – టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కాగా వంశీ – ప్రమోద్ – ప్రసీద – భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు.

    అయితే, ‘రాధేశ్యామ్’ సినిమాని మొదటి నుంచి ఓవర్ గా ప్రమోట్ చెయ్యట్లేదు. సినిమాలో పెద్దగా మ్యాటర్ లేదు అన్నట్టే టీమ్ ప్రమోట్ చేస్తూ వస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ను చాలా సింపుల్ గా కట్ చేశారు. ప్రభాస్ స్టార్ హీరో అయినా, పాన్ ఇండియా స్టార్ హీరో అయినా కేవలం పరిపూర్ణమైన ప్రేమ కథతోనే ఈ సినిమా సాగుతుందని ఎలివేట్ చేస్తూ వస్తున్నారు.

    Tags