spot_img
Homeఎంటర్టైన్మెంట్Top 10 Indian movies: జపాన్ లో అత్యధిక వసూళ్ళను రాబట్టిన టాప్ 10 ఇండియన్...

Top 10 Indian movies: జపాన్ లో అత్యధిక వసూళ్ళను రాబట్టిన టాప్ 10 ఇండియన్ మూవీస్ ఇవే.. పుష్ప 2 ఏ స్థానం లో ఉందంటే!

Top 10 Indian movies: మన టాలీవుడ్ కి ‘బాహుబలి’ తర్వాత నేషనల్ లెవెల్ లోనే కాదు , ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా మంచి గుర్తింపు లభించింది అనడం లో ఎలాంటి సందేహం లేదు. నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల్లో 2 దశాబ్దాల క్రితం నుండే మనకు మార్కెట్ ఉంది. ఎందుకంటే అక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి. కానీ జపాన్, చైనా వంటి దేశాల్లో మాత్రం మన టాలీవుడ్ కి గుర్తింపు వచ్చింది బాహుబలి సిరీస్ తర్వాత మాత్రమే. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉండరు. కేవలం లోకల్ ఫారినర్స్ మాటమే ఉంటారు. అలాంటి చోట మన టాలీవుడ్ కి మార్కెట్ ఏర్పడింది. జపాన్ దేశం లో ప్రభాస్, అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సాధారణమైనది కాదు. రీసెంట్ గానే అల్లు అర్జున్ ‘పుష్ప 2’ విడుదలై మంచి హిట్ అయ్యింది.

‘పుష్ప 2’ తో పాటు మన ఇండియన్ సినిమాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 10 మూవీస్ లిస్ట్ ని ఇప్పుడు మనం చూడబోతున్నాము. ప్రస్తుతానికి మొదటి స్థానం లో #RRR చిత్రం కొనసాగుతుంది. జపాన్ దేశం లో ఈ చిత్రం ఒక ప్రభంజనం అనే చెప్పాలి. సంవత్సరానికి పైగా థియేటర్స్ లో ఈ చిత్రం ప్రదర్శితమైంది, దాదాపుగా 2.42 బిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ రికార్డు ని అందుకోవడానికి మహేష్, రాజమౌళి ‘వారణాసి’ కి కూడా చాలా కష్టమైన టాస్క్. ఇక రెండవ స్థానం లో 405 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లతో సూపర్ స్టార్ రజినీకాంత్ ‘ముత్తు’ చిత్రం కొనసాగుతుంది. 30 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా ఆరోజుల్లోనే 405 మిలియన్ డాలర్స్ రాబట్టడమే కాకుండా ఇప్పటికీ 2వ స్థానం లో కొనసాగుతుంది అంటే ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ చిత్రం దాదాపుగా 305 మిలియన్ డాలర్ల గ్రాస్ తో మూడవ స్థానం లో కొనసాగుతుండగా, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన ‘3 ఇడియట్స్’ అనే చిత్రం 170 మిలియన్ డాలర్ల గ్రాస్ తో నాల్గవ స్థానంలో నిల్చింది. ఇక ఆ తర్వాత శ్రీదేవి ప్రధాన పాత్రలో పోషించిన ‘ఇంగ్లీష్ వింగ్లిష్’ చిత్రం, 160 మిలియన్ డాలర్ల గ్రాస్ తో 5వ స్థానం లో కొనసాగుతుండగా,’ది లంచ్ బాక్స్’ అనే చిత్రం 150 మిలియన్ డాలర్ల గ్రాస్ తో 6వ స్థానంలో, ప్రభాస్ ‘సాహూ’ చిత్రం 131 మిలియన్ డాలర్స్ తో 7వ స్థానంలో కొనసాగుతుంది. అదే విధంగా రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్ లో 2009 వ సంవత్సరం లో విడుదలైన ‘మగధీర’ చిత్రం 130 మిలియన్ డాలర్ల గ్రాస్ తో 8వ స్థానంలో కొనసాగుతుండగా, రజినీకాంత్ ‘రోబో’ చిత్రం 109 మిలియన్ డాలర్ల తో 9వ స్థానంలో కొనసాగుతుంది. ఇక రీసెంట్ గా జపాన్ లో విడుదలైన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం రెండు వారాల్లో 105 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం 10వ స్థానంలో కొనసాగుతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version