Jr NTR: నందమూరి తారకరామారావు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ లో అగ్రహీరోగా ఎదిగాడు. తన నటనా కౌషలంతో ఇప్పుడు ఆరితేరాడు. ఆర్ఆర్ఆర్ తో ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదగబోతున్నాడు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈయన సినిమాలో తన నటనతో, తన డైలాగ్స్ తో , డ్యాన్స్ తో ఇలా అన్ని విభాగాల్లోనూ తనదైన మార్క్ ను ఏర్పరుచుకున్నారు.

తాత సీనియర్ ఎన్టీఆర్ స్ఫూర్తితో జూనియర్ ఎన్టీఆర్ గా సినిమాల్లోకి వచ్చాడు. ‘బాల రామాయణం’తో ఎంట్రీ ఇచ్చి సినిమాల్లో ప్రస్థానం ప్రారంభించాడు. అనంతరం రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నంబర్ 1’తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం సింహాద్రి,రాఖి, యమదొంగ, టెంపర్, జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో , ఇప్పుడు ఆర్ఆర్ఆర్ వరకూ అంచెలంచెలుగా ఎదిగాడు.
ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగేందుకు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’తో రెడీ అయ్యాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఒక వెలుగు వెలుగుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు సీరియల్ లో నటించిన విషయం చాలా మందికి తెలియదు.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సీరియల్ ఎంతో హిట్ కూడా అయ్యింది. ఈ సీరియల్ పేరు ‘భక్త మార్కండేయ’. ఈ సీరియల్ లో ఎన్టీఆర్ నటించాడన్నది చాలామందికి తెలియదు. అప్పుడు చిన్నగా ఎన్టీఆర్ ఉన్నాడు.
ఈటీవీ మొదలుపెట్టిన కొత్తలో ఈ సీరియల్ వచ్చింది. ఇందులో మార్కండేయుడిగా ఎన్టీఆర్ నటించాడు. శివభక్తుడిగా ఎన్టీఆర్ అందరి మనసులు గెలుచుకున్నాడు..
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భక్త మార్కండేయ సీరియల్ లో నటించిన విషయం ఎవరికి తెలియదు. అతడి గెటప్ లో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బుల్లితెరపై బిగ్ బాస్, మీలో ఎవరు కోటీశ్వరులు షోతో పాపులర్ అయ్యారు.