Vijay Sethupathi: ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిపై దాడి జరిగింది. బెంగుళూరు ఎయిర్ పోర్టులో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. కాగా షూటింగ్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఆయనపై ఒక వ్యక్తి ఈ దాడి చేసినట్లు అంటున్నారు. తమిళంతో పాటు… తెలుగులోనూ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు విజయ్. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఆ వీడియోలో వీడియోలో విజయ్ సేతుపతి తన బృందంతో కలిసి వెళ్తుండగా… వెనుక నుంచి వ్యక్తి బలంగా విజయ్ సేతుపతి పీఏని ఎదిరి తన్నినట్లు కనిపిస్తుంది. ఈ దాడికి సంబంధించి వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. మద్యం మత్తులో ఒక వ్యక్తి విజయ్ పీఏతో గొడవకు దిగగా… వారు కూడా తిరిగి వారించడంతో కోపంలో అతను ఈ దాడికి పాల్పడ్డట్టు సమాచారం అందుతుంది.
Actor #VijaySethupathi was attacked at bangalore airport.
This is a Bad thing.. he is a celebrity.. 😠
— Akash (@massavatar) November 3, 2021
అయితే ఆ తరువాత అతను విజయ్ బృందానికి క్షమాపనలు చెప్పడంతో ఈ గొడవ సర్దుమణిగినట్లో చెబుతున్నారు. అలానే అతనిపై ఎలాంటి కేసు నమోదు చేయొద్దని విజయ్ సేతుపతి కోరినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియొ సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ గా మారింది. అయితే.. అలాంటి స్టార్ హీరోకి ఇలా జరగాదం పట్ల ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగ్యూలో విడుదలైన మాస్టర్, ఉప్పెన సినిమాలతో విజయ్ సేతుపతికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ వచ్చిందనే చెప్పాలి. ఇటీవల ఆయన నటించిన లాభం, ఆనబెల్ సేతుపతి చిత్రాలను తెలుగులో కూడా విడుదల చేశారు. త్వరలో విజ్ఞేష్ శివన్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం కూడా తెలుగులో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.