Suriya: సూర్య కోసం ఆ యంగ్ స్టార్ డైరెక్టర్ నిరీక్షణ ఎప్పుడు ఫలిస్తుందో…

రీసెంట్ గా తెలుగులో హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ప్రశాంత్ వర్మ. ఈయన ప్రస్తుతం సూర్యతో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు

Written By: Gopi, Updated On : February 15, 2024 2:39 pm
Follow us on

Suriya: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సూపర్ సక్సెస్ అయిందంటే ఆ సినిమాకు చెందిన దర్శకుడు తో ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలు అందరూ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే ఒక దర్శకుడు మాత్రం సక్సెస్ అందుకున్న కూడా స్టార్ హీరోలు అందరూ తనతో సినిమా చేయాలని చూస్తున్నప్పటికీ ఆయన మాత్రం తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సూర్యతో సినిమా చేయాలని చూస్తున్నాడు.

ఆయన ఎవరు అంటే రీసెంట్ గా తెలుగులో హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ప్రశాంత్ వర్మ. ఈయన ప్రస్తుతం సూర్యతో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు అయితే ఈ సినిమా స్టోరీ సైన్స్ ఫిక్షన్ కి సంబంధించిన స్టోరీగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే ప్రశాంత్ వర్మ కూడా చాలా సినిమాలకి కమిట్ అయి ఉన్నాడు.

అందువల్ల వీళ్ళిద్దరు ఫ్రీ అయిన తర్వాత ఈ సినిమాని తెరకెక్కించాలని చూస్తున్నాడు. అందుకోసమే సూర్య ఎప్పుడు ఫ్రీ అవుతాడా అని ప్రశాంత్ వర్మ ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ తన స్టామినా మొత్తాన్ని చూపించాలని చూస్తున్నాడు. అయితే కథ విన్న సూర్య కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మతో సినిమా చేయడానికి చాలామంది హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు.

కానీ తను రాసుకున్న స్టొరీకి సూర్య మాత్రమే సెట్ అవుతాడనే ఉద్దేశ్యం తో ప్రశాంత్ వర్మ సూర్య కోసం ఎన్ని రోజులైనా సరే వెయిట్ చేస్తానని ఆ స్టోరీ ని హోల్డ్ లో పెట్టి ఇంకో స్కిప్ట్ తో సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సూర్య , ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందో చూడాలి…ఇక వీళ్ళ కాంబో లో ఒక సినిమా వస్తె అది పక్క గా సూపర్ హిట్ అవుతుదంటు ఇప్పటికే చాలా మంది అభిమానులు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…