Pawan Kalyan experimental film: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వింటే కొన్ని కోట్ల మంది జనాలు అరుస్తూ, ఈలలు వేస్తూ గోలలు చేస్తూ ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ అటు పాలిటిక్స్ లో బిజీగా ఉంటూనే సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రీసెంట్ గా ఓజీ సినిమాతో ప్రేక్షకులందరిలో సూపర్ సక్సెస్ ని సాధించాడు.తెలుగు సినిమా ఇండస్ట్రీని తన సినిమాలతో కొత్త పుంతలు తొక్కించిన నటుడు కూడా తనే కావడం విశేషం…పవన్ కళ్యాణ్ సినిమాలు ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త పాయింట్ ను చెప్పాలనే ప్రయత్నం చేస్తుంటాడు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక ప్రయోగాత్మకమైన సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన ఎంటైర్ కెరియర్లో ఎప్పుడు ప్రయోగాత్మకమైన సినిమాలైతే చేయలేదు. ఫిజికల్ గా హ్యాండీక్యాప్డ్ గా కనిపించడం కానీ, మెంటల్ గా ఏదైనా డిసీజ్ తో బాధపడుతున్నట్టు కనిపించడం కానీ మనం ఎక్కడా చూడలేదు. ఒకవేళ అతన్ని అలా చూపించిన కూడా అభిమానులు దాన్ని జీర్ణించుకోలేరు. కాబట్టి ఆయన ఇప్పటివరకు అలాంటి క్యారెక్టర్లు చేయలేదు.
కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో ఒప్పుకున్న ఒక సినిమాలో బ్లైండ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో అతను బ్లైండ్ గా కనిపించబోతున్నాడా? లేదంటే ఇంకేదైనా సినిమా కోసం తను అలా కనిపించే ప్రయత్నం చేస్తున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.
అలాగే పవన్ కళ్యాణ్ సినిమా మొత్తం అలాగే కనిపిస్తాడా? లేదంటే మధ్యలో అతనికి కండ్లు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి పవన్ కళ్యాణ్ తో అలాంటి సినిమాలు చేస్తే వర్కౌట్ అవ్వవు అనేది అందరికీ తెలిసిన విషయమే…
కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఇక ఆయన చేసే మూవీస్ కూడా చాలా తక్కువగానే ఉంటున్నాయి. కాబట్టి ఆయన చేసే సినిమాలు ప్రయోగాత్మకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆయన ఏరికోరి మరి అలాంటి పాత్రలను సెలెక్ట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నిజంగానే అతను బ్లైండ్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…