Yellamma movie Updates: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటంటే వాళ్లు చేసిన సినిమాలకు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ ఆదరణ దక్కుతోంది. వాళ్ళ నుంచి వచ్చే ప్రతి సినిమా ఇండస్ట్రీలో పలు రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంటాయి. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట కూడా వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తున్నారు అనే విషయం పక్కన పెడితే ప్రతి ఒక్కరి టార్గెట్ కూడా పాన్ ఇండియాలో భారీ విజయాన్ని అందుకొని స్టార్ హీరోలుగా వెలుగొందడమే కావడం విశేషం…
ఇక ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు వేణు ఎల్దండి సైతం తన రెండో సినిమాని ఎల్లమ్మగా ప్రకటించాడు. అయితే ఈ సినిమా కోసం హీరోలను సెలెక్ట్ చేసుకుంటూ వెళుతున్న వేణుకి ఎవరు సపోర్ట్ చేయడం లేదు. వరుసగా హీరోలు ఈ ప్రాజెక్ట్ లోకి వస్తున్నారు.
మళ్ళీ తప్పుకుంటున్నారు కారణం ఏంటి అనే విషయం మీద సరైన క్లారిటీ రావడం లేదు.ఇక రీసెంట్ గా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవి శ్రీ ప్రసాద్ సైతం ఇందులో హీరోగా నటిస్తున్నాడని కొన్ని కథనాలైతే వెలువడుతున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి దేవిశ్రీప్రసాద్ కూడా తప్పుకున్నాడట.
కారణం ఏంటి అనే దాని మీద క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక ప్రస్తుతం దిల్ రాజు సైతం ఈ ప్రాజెక్టుని తాత్కాలికంగా నిలిపివేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. బలగం లాంటి సూపర్ సక్సెస్ ని అందుకున్న వేణు తన సెకండ్ సినిమా విషయంలో ఎందుకింత తడబడుతున్నాడు. హీరోలందరు మొదట ఈ సినిమాకి కమిట్ అయి మళ్ళీ ఎందుకని ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నారు అనే విషయం మీద సరైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాని పూర్తిగా ఆపేస్తారా? లేదంటే తత్కాలికంగా నిలిపివేసి మరొక హీరో దొరికిన తరువాత ఈ సినిమాని స్టార్ట్ చేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది…