Nagarjuna villain role: సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి హీరోగా చేసినవాళ్లు విలన్స్ గా నటించడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఒక్కసారి విలన్ పాత్ర చేస్తే వాళ్లకున్న మార్కెట్ ను పూర్తిగా కోల్పోవల్సి వస్తుందనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు విలన్ పాత్రలవైపు మొగ్గు చూపరు. కానీ నాగార్జున మాత్రం డిఫరెంట్ పాత్ర ఎక్కడున్నా కూడా దాన్ని వెతికి పట్టుకొని మరి నటించడానికి సిద్ధంగా ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే కూలీ, కుబేర లాంటి రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన కొత్త విలనిజానికి శ్రీకారం చుట్టాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు. అలాంటి నాగార్జున మరి కొద్ది రోజుల్లో ఫుల్ టైమ్ విలన్ గా మారిపోయే అవకాశాలైతే ఉన్నాయి. మంచి పాత్ర దొరికితే స్టార్ హీరోలకు విలన్ గా నటించి ప్రతి నాయకుడి పాత్రకి గొప్ప గుర్తింపును తీసుకురావాలని ఆయన ప్రయత్నమైతే చేస్తున్నాడు.
తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటాడు. విలన్ గా తనను తాను టాప్ లెవల్లో ఎలివేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ప్రస్తుతం తన వందో సినిమా మీదనే తన పూర్తి ఫోకస్ పెట్టాడు. ఇక తమిళ దర్శకుడు కార్తీక్ ఈ సినిమాను శరవేగంగా షూటింగ్ జరుపుతున్నాడు…
ఈ సంవత్సరంలోనే ఈ సినిమాని రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ ని అందించాలని దర్శకుడు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దానికి అనుగుణంగానే నాగార్జున సైతం దర్శకుడికి సపోర్ట్ చేస్తున్నాడు… ఇక నాగార్జున కొడుకులైన నాగచైతన్య, అఖిల్ సైతం హీరోలుగా రాణిస్తున్నారు.
మొత్తానికైతే అక్కినేని ఫ్యామిలీ గత కొద్దిరోజుల నుంచి కొంతవరకు డల్ అయినప్పటికి ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో వాళ్ళు పూర్తి క్లారిటీని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగాలనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక ఈ సంవత్సరం అక్కినేని హీరోలు తమ సత్తా చాటే అవకాశం కూడా ఉంది…