Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి ఏ హీరో సినిమా వచ్చిన కూడా ప్రేక్షకులు ఆ సినిమాలను ఆదరిస్తున్నారు. దాంతో ఆ నటులు తమకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జున హీరోగా రాణిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సైతం నటించి మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక అందులో భాగంగానే ఆయన కుబేర, కూలీ లాంటి సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. అలాంటి నాగార్జున ఒక రెండు సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడనే విషయం మనలో చాలామందికి తెలియదు. ముఖ్యంగా కుబేర, కూలీ సినిమాల వల్లనే ఆయన ఆ రెండు సూపర్ హిట్ సినిమాలను మిస్ అయిపోయాడు. అందులో ఒకటి ‘చావా ‘ కాగా, మరొక్కటి ‘దురంధర్’ సినిమా కావడం విశేషం…ఈ రెండు సినిమాల్లో కూడా అతను నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను చేయాల్సి వచ్చిందట. కానీ కుబేర, కూలీ రెండు సినిమాల వల్ల ఆ రెండు సినిమాలను వదిలేసుకోవాల్సి వచ్చింది అంటూ తన సన్నిహితుల దగ్గర ఒక క్లారిటి ఇచ్చే ప్రయత్నం చేశాడు.
ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికి సాధ్యం కానీ రీతిలో గొప్ప సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకుంటున్నారు. ఇక ఇలాంటి సందర్భంలో నాగార్జున మాత్రం తనని తాను నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక చావా, దురంధర్ రెండు సినిమాల్లో తను మెయిన్ విలన్ గా నటించాల్సి ఉంది. కానీ కుబేర కూలీ సినిమాల వల్ల ఆ పాత్రను తను మిస్ చేసుకోవడంతో అక్షయ్ కన్నా రెండు పాత్రలను పోషించి తనకంటూ ఒక ఐడెంటిటి సంపాదించి పెట్టుకున్నాడు… ఇక కుబేర, కూలీ రెండు సినిమాలు చేయకపోయిన చావా, దురంధర్ రెండు సినిమాలు చేసి ఉంటే బాగుండేదని నాగార్జున అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు.
కారణమేంటంటే దురంధర్ సినిమాలో చేసినందుకు కాను అక్షయ్ ఖన్నా కి చాలా మంచి గుర్తింపు వచ్చింది. ఆయన టాప్ మోస్ట్ నటుడిగా ఎదిగాడు… ఒకవేళ ఆ క్యారెక్టర్ లో నాగార్జున చేసి ఉంటే ఆ గుర్తింపు నాగార్జునకి వచ్చి ఉండేదని పలువురు సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతుండటం విశేషం…