Balakrishna- Pawan Kalyan: అన్ స్టాపబుల్2 విత్ ఎన్బీకే అంటూ బుల్లితెరపై హాట్ ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నారు నందమూరి బాలయ్య. అటు టాలీవుడ్ లో స్టార్ హీరోగా.. ఇటు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా రాణిస్తున్న బాలయ్యలోని మరో కోణాన్ని అన్ స్టాపబుల్ షో వెలికితీసింది.

రెండో సీజన్ లో ఈ షోకు తొలి గెస్ట్ గా చంద్రబాబు హాజరై సీనియర్ ఎన్టీఆర్ ను కూలదోసినప్పటి విషయాలన్నీ పంచుకున్నారు. అవిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రెండో ఎపిసోడ్ లో కుర్రహీరోలు సిద్దూ, విశ్వక్ సేన్ హాజరై సందడి చేశారు. మూడో ఎపిసోడ్ కు శర్వానంద్, అడవి శేష్ హాజరయ్యారు.
ఇక ముచ్చటగా మూడో ఎపిసోడ్ కోసం బాలయ్య భలే ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ ఎపిసోడ్ కు చీఫ్ గెస్ట్ గా జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నాడని.. ఈమేరకు షూటింగులు, రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కోసం బాలయ్య వ్యక్తిగతంగా రంగంలోకి దిగి మరీ తీసుకొచ్చాడని సమాచారం.

బాలయ్య తాజాగా పవన్ ను కలిసి షోకు రావాలని ఆహ్వానించాడని.. అతడితోపాటు త్రివిక్రమ్ ను కూడా ఆహ్వానించినట్టు సమాచారం. మరి ఈ వార్త నిజమైతే బాలయ్య షోలో పవన్ కళ్యాణ్ కనిపిస్తే మాత్రం మెగా, నందమూరి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోవడం ఖాయం. పవన్ ఏం చెబుతారు? షో రేటింగ్ బద్దలు కావడం ఖాయమంటున్నారు. మరి ఈ వార్త నిజమైతే మాత్రం అందరికీ పండుగే అనడంలో ఎలాంటి సందేహం లేదు.