Chiranjeevi as Sankranthi winner: చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో తనదైన మార్కు ను చూపించలేకపోతున్నాడు. వరుస సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్నాడు. అయినప్పటికి చిరంజీవి ఒకప్పటి తన మేనియాను మాత్రం రిపీట్ చేయలేకపోతున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన ఖైదీ నెంబర్ 150 ,సైరా, గాడ్ ఫాదర్, భోళా శంకర్ లాంటి సినిమాలు చేసినప్పటికి అవేవీ పెద్దగా సక్సెస్ లను సాధించలేదు. వాల్తేరు వీరయ్య మాత్రం ఓకే అనిపించుకుంది. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాతో చిరంజీవి ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరి ముందు చిరంజీవి వెనుకబడిపోయాడనే చెప్పాలి.
ఇక ఈ సినిమాతో 400 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొడుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. చిరంజీవి మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. మరి అతను మరోసారి కమర్షియల్ ఎంటర్ టైనర్ ను నమ్ముకుంటే భారీ విజయాన్ని అందుకోవచ్చనే ఉద్దేశ్యంతోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
తను అనుకున్నట్టుగా ఆయనకు భారీ సక్సెస్ వస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే…తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో గొప్ప విజయాన్ని సాధిస్తే మాత్రం సీనియర్ హీరోలందరి లో తను మొదటి స్థానానికి వెళ్లిపోతాడు. లేకపోతే మాత్రం మరోసారి చిరంజీవి వెనుకబడిపోయే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈ సంక్రాంతి విన్నర్ తనే అవ్వాలని చూస్తున్నాడు.
ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికి ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలైతే లేవు…ఎందుకంటే ప్రభాస్ ఈ సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టి చేయలేదనే విషయం ప్రతి ఒక్కరికి అర్థం అయిపోయింది. జస్ట్ టైం పాస్ కి మాత్రమే ఈ సినిమాను చేశాడు. ఈ మూవీ ఆడకపోయిన ప్రభాస్ కి పెద్దగా పోయేదేమీ లేదు. కాబట్టి ప్రభాస్ అభిమానులు సైతం ఈ సినిమాని సీరియస్ గా తీసుకోవడం లేదు. ప్రభాస్ ని ఢీ కొట్టి చిరంజీవి సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…