Kanishka Soni: పెళ్లి అంటే.. వధువు, వరుడు, పందిళ్లు, వేద మంత్రాలు , తాళాలు, తప్పెట్లు, తలంబ్రాలు… ఇలా బోలెడు వ్యవహారాలు ఉంటాయి. కానీ, కాలం మారింది. ఇప్పుడు వింత పెళ్లిళ్లు గురించి ఎన్నో వింటున్నాం, నిత్యం టీవీల్లో ఎన్నో చూస్తున్నాం. ఈ కోవలోనే ప్రముఖ టీవీ నటి.. ‘దియా ఔర్ బాతీ హమ్’ ఫేమ్.. కనిష్క సోని తనను తాను పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. పైగా శృంగారానికి పురుషుడు అవసరం లేదంటూ సంచలన కామెంట్స్ చేసింది. తనను తాను పెళ్లి చేసుకుంది. తనను తానే స్వీయ వివాహం చేసుకున్నాను అని ఇన్ స్టాగ్రామ్ వేదికగా కనిష్క సోని ప్రకటించింది. పైగా పాపిట సింధూరం, మెడలో మంగళసూత్రం ధరించిన ఫొటోలను కూడా నెటిజన్లతో పంచుకుంది. దాంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ ఈ బ్యూటీ స్వీయ వివాహం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది ?, ఆమెకు ఎందుకు ఈ ఆలోచన కలిగింది ? వంటి విషయాల గురించి చెబుతూ అప్పుడే ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఆమె ఏం మాట్లాడిందో ఆమె మాటల్లోనే విందాం. ‘ప్రస్తుతం సైన్స్, టెక్నాలజీ ఎంతో డెవలప్ అయ్యాయి. అందుకే, ఇప్పుడు ఆడవాళ్లకు శృంగారం కోసం మగవాడు అవసరం లేదు’. వాస్తవానికి పెళ్లి అనేది నా చిరకాల వాంఛ. కానీ, నా జీవితంలో నిజమైన మగాడు నాకు తగలలేదు. అందుకే, ఏ మగాడితో సంబంధం లేకుండా.. జీవితాంతం గడపాలని నిర్ణయించుకున్నాను’ అని కనిష్క సోని షాకింగ్ కామెంట్స్ చేసింది.
Also Read: Sonali Phogat : సోనాలి ఫోగట్ పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు.. హత్య కేసు నమోదు
ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “నేను ముంబైకి వచ్చినప్పుడు, చాలా మంది అబ్బాయిలు నాకు ప్రపోజ్ చేశారు, ఈ క్రమంలో నేను సుమారు 1200-1300 మంది ప్రపోజల్స్ ను తిరస్కరించాను. అయితే, చాలా ఫేమస్ నటుడు ఒకతను నన్ను పెళ్లి చేసుకుంటా అని నాకు దగ్గర అయ్యాడు. మొదట్లో నాతో చాలా ప్రేమగా ఉన్నాడు. కానీ, అతని నిజస్వరూపం కేవలం రెండు నెలల్లోనే బయటపడింది. అతను చాలా దారుణంగా ఉండేవాడు. ప్రతి 15 నిమిషాలకు కోపం తెచ్చుకునేవాడు, అతను వస్తువులను పగలగొట్టి వాటితో నన్ను కొట్టేవాడు. అయినా అతన్ని భరించాను. కానీ అతనికి హృదయం లేదు. అతని పేరు చెబితే..వివాదాలను సృష్టిస్తుంది కాబట్టి, నేను అతని పేరు చెప్పను, కానీ అతను చాలా వైల్డ్. నేను ఒకటిన్నర సంవత్సరాలు అతనితో ఉన్నాను.
చివరకు ఆ బంధాన్ని వదులుకున్నాను’ అని ఆమె చెప్పింది. అలాగే ఓ నిర్మాత కూడా ఆమెను బాగా ఇబ్బంది పెట్టాడట. తన గదికి వెళ్ళనందున టీవీ షో నుండి కనిష్క ను మధ్యలోనే తొలగించారని కూడా ఆమె చెప్పింది. ఇలా ఎన్నో అనుభవించిందట కనిష్క. ఇక తాను నటించడానికి బదులు ప్రొడక్షన్ లో ఏదైనా జాబ్‌కి మారాలని ప్రయత్నించినప్పుడు కూడా నిర్మాతలు తనను చాలా వేధించారు అని ఆమె పేర్కొంది

నిజానికి కనిష్క సోని గుజరాత్‌కు చెందిన చాలా సంప్రదాయవాద కుటుంబం నుంచి వచ్చింది. పైగా ఆమె ఎంతో పద్ధతిగా ఉంటుంది. అయినా కనిష్క సోని స్వీయ వివాహం చేసుకుంది. ఆమె ఇలా చేయడానికి ప్రధాన కారణం లవ్ ఫెయిల్యూరే. మూడు సార్లు ప్రేమలో కనిష్క సోని విఫలం అయింది. అందుకే, ఇక తన జీవితంలో మగాడు ఉండకూడదు అని కనిష్క సోని ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలోనే ఇలా తనను తానే పెళ్లి చేసుకుంది.
కనిష్క సోని మంచి నటినే. గతంలో ఆమె మహాబలి హనుమాన్ వంటి షోలలో దేవతల పాత్రల్లో నటించింది. కానీ, సినిమా వాళ్ళు ఎవరూ ఆమెను నటిగా పెద్దగా గుర్తించలేదు. అయితే, కనిష్క సోని.. దియా ఔర్ బాతీ హమ్ టీవీ షో ద్వారా ఎంతో ప్రాచుర్యం పొందింది. అంతేకాదు, పవిత్ర రిష్ట, దేవోంకే దేవ్ మహదేవ్, బాల్ వీర్, మహా భారత్ వంటి ఎన్నో టీవీ షోల్లో ఆమె నటించి మెప్పించింది .
ఏది ఏమైనా తనకు తానే మూడు ముళ్లు వేసుకుని, తనతో తానే ఏడు అడుగులు నడిచి తనకు తానే భర్తగానూ, భార్యగానూ మారిపోయింది కనిష్క సోని. జీవితాంతం గుర్తుండే మధుర కమనీయ ఘట్టాన్ని తనకు తానే అనుభవిస్తోంది. మొత్తానికి కనిష్క సోని పెళ్లి మాత్రం చాలా విభిన్నం.
Also Read:Anasuya Bharadwaj On Liger : లైగర్ ఫ్లాప్ ను అనసూయ పండుగ చేసుకుంటుందా? ఆ ట్వీట్ ఉద్దేశం అదేనా?