Tollywood: సినిమా చూసే ప్రతి ఒక్క ఆడియన్ కి ఎప్పుడో ఒకసారి ఒక డౌట్ వచ్చే ఉంటుంది. అదేంటంటే మనం టికెట్ కొని సినిమా చూస్తున్నాము. ఈ సినిమా టికెట్ డబ్బులు ఎవరికి వెళ్తాయి. దాంట్లో ఎవరెవరికి ఎంత పర్సెంట్ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అసలు థియేటర్ ఓనర్ దగ్గర నుంచి డబ్బులు ప్రొడ్యూసర్ కి ఎలా చేరుకుంటాయి. అనే డౌట్ అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇంక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ఒక స్టార్ హీరో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని పూర్తయిన తర్వాత ఫస్ట్ కాపీ వచ్చాక ఈ సినిమాను డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ రిలీజ్ చేయకుండా ఆయా ఏరియను బట్టి ఒక్కో డిస్ట్రిబ్యూటర్ కి అమ్ముతూ ఉంటాడు. ఇక డిస్ట్రిబ్యూటర్లు ఎవరెవరైతే థియేటర్ యజమానులు (ఎగ్జిబ్యూటర్స్) ఉన్నారో వాళ్ళకి అమ్మి దాని ద్వారా కొంత డబ్బుని ఆర్జిస్తారు. ఇక ప్రొడ్యూసర్ దగ్గర డిస్ట్రిబ్యూటర్లు ఎంతకైతే కొన్నారో ఆ రేటును బట్టి ఆయా ఎగ్జిబిటర్లకి ఆ సినిమాని డిస్ట్రిబ్యూటర్ అమ్ముతూ ఉంటాడు. మనం సినిమా టికెట్ కొన్నప్పుడు దాని మీద వచ్చే డబ్బులు ముందు ఎగ్జిబ్యూటర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ కి వెళ్తాయి.
ఆ తర్వాత ప్రొడ్యూసర్ కి చేరుకుంటాయి. ఇక ఈ సినిమాని కొనుక్కున్నప్పుడు వీళ్ళు కొంత అడ్వాన్స్ పే చేసి మాత్రమే సినిమా ని తీసుకుంటారు. ఇక సినిమా టికెట్ల మీద డబ్బులు వచ్చే కొద్ది ప్రొడ్యూసర్స్ కి డబ్బులను చెల్లిస్తూ ఉంటారు. అలా ఎవరికి వారు ఎంత పర్సెంట్ లో చెల్లించాలి అనేది ముందే డీల్ ఫిక్స్ చేసుకొని పెట్టుకుంటారు. కాబట్టి అంత పర్సెంట్ చెల్లించిన తర్వాత వాళ్ళకి వచ్చే ప్రతిది కూడా లాభంగానే పరిగణించబడుతుంది. నష్టం వస్తే మాత్రం ఎగ్జిక్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లే ఎక్కువగా నష్టపోతారు.
ప్రొడ్యూసర్ కి కూడా నష్టం ఉంటుంది కానీ వీరితో పోల్చుకుంటే కొద్ది మేరకు తక్కువగానే ఉంటుందని చెప్పాలి. ఇంకా ఇంత రిస్క్ చేసి సినిమా చేసి సక్సెస్ కొడితే అందరూ హ్యాపీగా ఉంటారు. లేకపోతే మాత్రం అందరూ బాధపడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అందుకే దర్శకులు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు చేస్తే అందరి ఫ్యామిలీలు చాలా హ్యాపీగా ఉంటాయనే చెప్పవచ్చు…