https://oktelugu.com/

Jai Hanuman: జై హనుమాన్ సినిమాలో హనుమతుడుగా ఆ స్టార్ హీరో…హింట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ…

"జై హనుమాన్" అనే సినిమాని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా మొత్తం హనుమంతుడి క్యారెక్టర్ మీద బేస్ చేసుకొని ఉంటుందని తాను ఇంతకుముందే తెలియజేశాడు.

Written By:
  • Gopi
  • , Updated On : April 18, 2024 / 06:47 PM IST

    Jai Hanuman

    Follow us on

    Jai Hanuman: ఈ సంవత్సరం రిలీజ్ అయిన చాలా సినిమాలు సక్సెస్ లను సాధిస్తూ ముందుకెళుతున్నాయి. ఇక సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాలు ఏవి ఆశించిన విజయాలను అందుకోలేదు. కానీ సంక్రాంతి సినిమాగా వచ్చిన చిన్న సినిమా అయిన హనుమాన్ సినిమా మాత్రం ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. అయితే ఈ సినిమా దాదాపు 400 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి ఈ సంవత్సరం ఇప్పటివరకు అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

    ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాకి సీక్వెల్ గా “జై హనుమాన్” అనే సినిమాని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా మొత్తం హనుమంతుడి క్యారెక్టర్ మీద బేస్ చేసుకొని ఉంటుందని తాను ఇంతకుముందే తెలియజేశాడు. ఇక దీనికి టైటిల్ కూడా “జై హనుమాన్” అని పెట్టడంతో ఈ సినిమా మొత్తం హనుమంతుడు చేసే దుష్ట శిక్షణ మీదనే ఆధారపడి ఉంటుందని ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో హనుమంతుడి పాత్రను ఎవరు పోషిస్తున్నారు అనే దాని మీద కూడా ఇప్పుడు చాలా రకాల రూమర్లైతే వస్తున్నాయి.

    ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే హనుమంతుడి పాత్రలో రానా ను తీసుకోబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. ఎందుకంటే రానా అయితే ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు అని అందరూ అంటున్నారు. ఇక మరికొందరు మాత్రం కే జి ఎఫ్ సినిమాతో స్టార్ హీరో గుర్తింపు పొందిన “యష్ ” ఈ క్యారెక్టర్ లో నటించబోతున్నాడు అని చెబుతున్నారు.
    ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ మాత్రం ఈ విషయం మీద సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు.

    ఇక తొందర్లోనే ఈ సినిమాకి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ అన్నింటిని ప్రేక్షకుల ముందు ఉంచుతానని ప్రశాంత్ వర్మ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం… ఇక శ్రీరామనవమి సందర్భంగా హనుమంతుడు రాముడికి మాట ఇచ్చినట్టుగా ఒక పోస్టర్ ను అయితే రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ ఆధారంగానే సినిమా ఉండబోతుందని దర్శకుడు హింట్ కూడా ఇచ్చాడు…