Puri Jagannadh Vs Trivikram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నా కూడా పూరి జగన్నాథ్(Puri Jagannadh) లాంటి దర్శకుడికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి సినిమాలు ఇండస్ట్రీలో మరే దర్శకుడు చేయలేదనే చెప్పాలి. ఆయన చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ఇక అందులో భాగంగానే ఆయన ఎక్కువగా యూత్ ని అట్రాక్ట్ చేస్తూ డైలాగులు రాస్తూ సినిమా మీద మంచి అంచనాలను పెంచడమే కాకుండా, ప్రతి ఒక్క ఆడియన్ ను సాటిస్ఫై చేయడంలో ఆయన ఎప్పుడు సక్సెస్ అవుతూ ఉంటాడు.
ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీకి మొదట రైటర్ గా ఎంట్రీ ఇచ్చిన త్రివిక్రమ్(Trivikram) కూడా మొదట వరుస హిట్లను అందుకొని ఆ తర్వాత డైరెక్టర్ గా మారాడు. ఇక ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోలకి సైతం బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇస్తు వస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే పూరి జగన్నాథ్ త్రివిక్రమ్ ఇద్దరు డైలాగ్స్ బాగా రాస్తారు అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే వీళ్ళలో ఎవరి డైలాగ్స్ బాగుంటాయి అనే దాని మీద గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. ఇక అందులో కొంతమంది పూరి జగన్నాథ్ పేరు చెప్తే మరి కొంతమంది మాత్రం త్రివిక్రమ్ పేరును చెబుతున్నారు.
ఇక ముఖ్యంగా వీళ్లిద్దరి గురించి కనక మనం తెలుసుకున్నట్లయితే పూరి జగన్నాథ్ ఫిలాసఫీకి సంబంధించిన మాటలను ఆయన డైలాగ్స్ లో ఎక్కువగా చెప్తూ ఉంటాడు. అందువల్లే ఆయన సినిమాల్లో డైలాగ్స్ ప్రేక్షకుడికి ఈజీగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఇక త్రివిక్రమ్ పురాణాలను బేస్ చేసుకొని వాటిని నిజ జీవితానికి అన్వయిస్తూ డైలాగులు రాయడం లో ఆయన దిట్ట…
ఇలా ఇద్దరు ఎవరికి వారే అద్భుతమైన డైలాగ్స్ రాస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వస్తున్నారు. ఇక వీళ్లలో ఎవరు గొప్ప అనే విషయం మనం చెప్పడం కష్టమే. కానీ ప్రస్తుతానికి వీళ్ళిద్దరూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నందుకు మనందరం గర్వపడాలి…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More