Star Heroes: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు వాళ్ళకంటు ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నారు. అప్పట్లో ఉన్న హీరోలు డ్యాన్స్ లు పెద్దగా వేయకపోయినా యాక్టింగ్ బాగా చేస్తే సరిపోయింది. కానీ ఇప్పుడున్న ప్రేక్షకుడు ఒక హీరోని యాక్సెప్ట్ చేయాలి అంటే ఆ హీరో అన్ని రకాలుగా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఇక అందులో భాగంగానే తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు మంచి డాన్సర్లుగా కొనసాగుతున్నారు. ఇక ఇప్పుడున్న యంగ్ హీరోలు అందరూ డ్యాన్స్ లకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నప్పటికీ వీళ్ళు ముగ్గురు మాత్రం బెస్ట్ డాన్సర్స్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ లో హృతిక్ రోషన్ చాలా సంవత్సరాల నుంచి డాన్స్ లో అదరగొడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరు వార్ 2 అనే సినిమాలో నటిస్తున్నారు.
కాబట్టి వీళ్ళ మధ్య ఖచ్చితంగా ఒక పాటలో డాన్స్ పోటీ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక రాజమౌళి తీసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఒక సాంగ్ లో పోటీపడి మరి డాన్స్ చేసిన విషయం మనకు తెలిసిందే…దానికి తగ్గట్టుగానే వాళ్ల సినిమాలో కూడా అలాంటి పోటీనే ఉండబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ డ్యాన్సర్ గా నిలుస్తారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇక మొత్తానికైతే వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సర్ గా నిలుస్తారు అనేది తెలుసుకోవడానికి యావత్ ఇండియా మొత్తం ఆసక్తి ఎదురుచూస్తుంది. ఇక నిజానికి హృతిక్ రోషన్ కూడా చాలా మంచి డాన్సర్ ఎన్టీఆర్ అయితే ఇంకా మాస్, క్లాస్ అని తేడా లేకుండా అన్ని రకాల డ్యాన్స్ లను ఇరగదీసేస్తాడు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరి దృష్టి వీళ్లిద్దరి పైనే ఉంది..చూడాలి మరి వార్ 2 సినిమాలో వీళ్ళు ఎలా డ్యాన్స్ చేస్తారు అనేది…