https://oktelugu.com/

Gangs Of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కి రంగస్థలం సినిమాకి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే..?

మరో రెండు మూడు రోజుల్లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలయ్య వచ్చి సినిమా యూనిట్ మొత్తానికి ఒక రకమైన బూస్టప్ అయితే ఇచ్చాడు.

Written By:
  • Gopi
  • , Updated On : May 29, 2024 / 09:10 AM IST

    Gangs Of Godavari

    Follow us on

    Gangs Of Godavari: విశ్వక్ సేన్ హీరోగా చైతన్య కృష్ణ డైరెక్షన్ లో వస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఈనెల 31వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే రీసెంట్ గా ఈ సినిమాకు సంభందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో నేహ శెట్టి తో పాటు అంజలి కూడా ఒక కీలక పాత్ర లో నటిస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ను చూస్తుంటే ఇది ఒక ఊర్లో జరిగే రివేంజ్డ్ స్టోరీ గా తెలుస్తుంది.

    అయితే ఇందులో అంజలి పాత్ర రంగస్థలం సినిమాలో అనసూయ పాత్రను పోలి ఉంటుందనే వార్తలైతే వస్తున్నాయి. ఇక అనసూయ పోషించిన రంగమ్మత్త క్యారెక్టర్ హీరో ప్రాబ్లమ్స్ ని షేర్ చేసుకుంటుంది. కాబట్టి ఈ సినిమాలో కూడా అంజలి విశ్వక్ సేన్ ప్రాబ్లమ్స్ ని షేర్ చేసుకుంటూ అతన్ని మోటివేట్ చేసే పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో అంజలి మరోసారి కంబ్యాక్ ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో విశ్వక్ సేన్ ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.

    మరో రెండు మూడు రోజుల్లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలయ్య వచ్చి సినిమా యూనిట్ మొత్తానికి ఒక రకమైన బూస్టప్ అయితే ఇచ్చాడు. ఇక ఇలాంటి క్రమంలోనే విశ్వక్ సేన్ ఈ సినిమాతో మరో సక్సెస్ ని సాధిస్తే వరుసగా రెండు విజయాలు అందుకున్న వాడవుతాడు.

    ఇక రీసెంట్ గా ‘గామి’ సినిమాతో ఒక డీసెంట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు ఈ సినిమాతో మరొక సూపర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న వాడు అవుతాడు అనేది వాస్తవం…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది…