Trivikram Srinivas: త్రివిక్రమ్ అజ్ఞాతం లోకి వెళ్ళడానికి కారణం ఏంటి..? ఒక్క ప్లాప్ కే ఇలా అయిపోవాలా..?

ఒకప్పుడు స్టార్ హీరోలకు సైతం తను సూపర్ సక్సెస్ లను అందించి వాళ్ళకు స్టార్ డమ్ ని క్రియేట్ చేశాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన మహేష్ బాబుతో చేసిన 'గుంటూరు కారం' సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Written By: Gopi, Updated On : June 10, 2024 9:04 am

Trivikram Srinivas

Follow us on

Trivikram Srinivas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో జంధ్యాల తర్వాత రైటర్ గా అంత మంచి పేరు సంపాదించుకున్న రచయిత త్రివిక్రమ్…ఈయన మొదట రైటర్ గా సూపర్ సక్సెస్ అయ్యాక ఆ తర్వాత డైరెక్టర్ గా మారి మంచి సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ తనదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు ఆశించిన మేరకు సక్సెస్ కావడం లేదు.

ఇక ఒకప్పుడు స్టార్ హీరోలకు సైతం తను సూపర్ సక్సెస్ లను అందించి వాళ్ళకు స్టార్ డమ్ ని క్రియేట్ చేశాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన మహేష్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం తన ప్రభావాన్ని చూపించకపోవడంతో త్రివిక్రమ్ మార్కెట్ ఒక్కసారిగా భారీగా డౌన్ అయిపోయింది. ఇక రొటీన్ సినిమాలు మాత్రమే త్రివిక్రమ్ చేస్తాడు డిఫరెంట్ సినిమాలు చేయడం ఆయన వల్ల కాదు అంటూ చాలా విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇక దానివల్లే ఆయన చాలా రోజుల నుంచి అజ్ఞాతంలో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా రామోజీరావు చనిపోయిన వార్త తెలిసిన తర్వాత త్రివిక్రమ్ మీడియా ముందుకి వచ్చారు.

అయినప్పటికీ తను నెక్స్ట్ ఏ సినిమా చేయబోతున్నాడు అనేది మాత్రం క్లారిటీ గా తెలియ జేయలేకపోతున్నాడు. ఇక దానికి కారణం అల్లు అర్జున్ తనతో సినిమా చేస్తాను అని కమిట్ అయినప్పటికీ ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్ కి అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే లేనట్టుగా కనిపిస్తుంది. ఇక మరో పక్క ఎనర్జిటిక్ స్టార్ అయిన రామ్ తో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాని చేయబోతున్నాడనే వార్తలు వచ్చినప్పటికీ రామ్ తో ఇప్పుడు సినిమా చేయడానికి త్రివిక్రమ్ సిద్ధంగా లేడు. ఇక ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ఏంటంటే త్రివిక్రమ్ స్టార్ హీరో కోసం ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ పొజిషన్ లో ఏ స్టార్ హీరో కూడా తనకు డేట్స్ ఇచ్చే అవకాశాలైతే లేవు. మరి ఇలాంటి సమయం లో రామ్ తో సినిమా చేయొచ్చు కదా అని పలువురు సినీ మేధావులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

అయితే సక్సెస్ లో ఉన్నప్పుడు మీడియం రేంజ్ హీరోతో సినిమా చేస్తే పర్లేదు. కానీ ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు స్టార్ హీరోలు డేట్స్ ఇవ్వలేకపోవడం వల్ల మీడియం రేంజ్ హీరోతో సినిమా చేసే స్థాయికి త్రివిక్రమ్ వెళ్లిపోయాడు అనే రూమర్లు వస్తాయనే ఉద్దేశంతోనే రామ్ ని పక్కన పెడుతున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి త్రివిక్రమ్ నెక్స్ట్ ఏ హీరోతో తన సినిమా చేయబోతున్నాడు అనేది…