Double ISmart: డబుల్ ఇస్మార్ట్..ఈ ఒక్క సినిమాతో గాడిలో పడనున్న ఇద్దరి కెరియర్లు..

రీసెంట్ గా రామ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా ఆ టీజర్ లో రామ్ చాలా ఎనర్జిటిక్ గా డైలాగు చెప్పడం అనేది ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అలరించింది.

Written By: Gopi, Updated On : June 10, 2024 9:07 am

Double ISmart

Follow us on

Double ISmart: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్… ప్రస్తుతం ఆయన ఎనర్జిటిక్ స్టార్ అయిన రామ్ ను హీరోగా పెట్టి డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలనే లక్ష్యంతో తను ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా మీద టాలీవుడ్ లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక రీసెంట్ గా రామ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా ఆ టీజర్ లో రామ్ చాలా ఎనర్జిటిక్ గా డైలాగు చెప్పడం అనేది ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అలరించింది. ఇక అలాగే పూరి మార్క్ డైలాగులు కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటించడం సినిమాకి భారీగా కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి.

ఇక ఏది ఏమైనా లైగర్ లాంటి భారీ ప్లాప్ అందుకున్న తర్వాత పూరి జగన్నాథ్ ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ఓ సూపర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే రామ్ కూడా పూరి జగన్నాథ్ ఎలా చెబితే అలా నటిస్తూ అతను కూడా భారీ సక్సెస్ కోసం చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నాడు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకుముందు ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అయితే వచ్చింది.

ఇక దానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే పూరికి మరోసారి స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలైతే వస్తాయి. అలాగే రామ్ కూడా స్టార్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్ ను విస్తరించుకుంటాడు. చూడాలి మరి ఈ ఒక్క సినిమాతో వీళ్ళిద్దరి లైఫ్ లు సెటిల్ అవుతాయా లేదా అనేది…