https://oktelugu.com/

Double Ismart: ఇస్మార్ట్ శంకర్ కు.. డబుల్ ఇస్మార్ట్ కు తేడా ఏంటి? పూరి హిట్ కొట్టగలడా..?

పూరీ జగన్నాధ్ అంటే ఒక బ్రాండ్... ఆయన చేసిన సినిమాలు ఆయన్ని ఒక స్టార్ డైరెక్టర్ పోజిషన్ లో కూర్చోబెట్టాయి. ఇక ఇప్పటికీ ఆయనలా ఒక కమర్షియల్ సినిమాను తీసే డైరెక్టర్ మరొకరు లేరనేది వాస్తవం...

Written By:
  • Gopi
  • , Updated On : August 10, 2024 / 10:08 AM IST

    Double Ismart

    Follow us on

    Double Ismart: ఒకప్పుడు పూరీ జగన్నాథ్ పేరు చెబితే అభిమానుల్లో జోష్ ఉండేది. ప్రేక్షకుల్లో ఆయన సినిమాల కోసం చూపులు ఉండేవి, ఆయన ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరోకి ఒక సపరేట్ మేనరిజం అనేది క్రియేట్ అవుతూ ఉండేది. అందుకే పూరి జగన్నాధ్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఎదురుచూస్తూ ఉండేవారు. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో పూరి సినిమాలు చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం ఆయన మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. దానికి కారణం ఏంటి అంటే గతంలో ఆయన చేసిన సినిమాలు డిజాస్టర్లుగా మిగలడమే అని చాలా మంది సినీ మేధావులు చెబుతున్నారు. ఆయన ఎందుకు తన ఫామ్ ని కోల్పోయాడు అనే విషయం పక్కన పెడితే మరోసారి ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా భారీ సక్సెస్ ని కూడా తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అందుకే ఈనెల 15వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యాడు. ఇక రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఇంతకుముందే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా వచ్చింది. ఈ సినిమా సక్సెస్ అవ్వడం తి రామ్ ఒక్కసారిగా మాస్ ఆడియెన్స్ లో భారీ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే దీనికి సీక్వెల్ గా ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాను చేశాడు. ఇక మొదటి పార్ట్ ను మించి ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలైతే ప్రేక్షకుల్లో కలుగుతున్నాయి. నిజానికి పూరి ఈ మధ్యకాలంలో చేసిన ది బెస్ట్ సినిమా ఏదైనా ఉంది అంటే అది ఇస్మార్ట్ శంకర్ అనే చెప్పాలి. టెంపర్ తర్వాత ఆయన చేసిన సినిమాల్లో అదొక్కటే సక్సెస్ అయింది. ఇక దానికి తోడుగా ఆయనకు ఆ సినిమాతో మంచి గుర్తింపు కూడా వచ్చింది. మరి ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా ఇస్మార్ట్ శంకర్ లానే ఉండబోతుంది అనే వార్తలైతే వస్తున్నాయి.

    ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ట్రైలర్ ని కనక మనం చూసుకున్నట్లైతే ఇక మొదటి పార్ట్ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే ఈ సినిమా స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక దానికి తోడుగా సంజయ్ దత్ లాంటి ఒక భారీ యాక్టర్ ఈ సినిమాలో విలన్ పాత్రను పోషించడం కూడా ఈ సినిమాకి చాలా వరకు హెల్ప్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.

    ఇక తన బ్రెయిన్ ని హీరోకి ఎక్కించి ఆయన ద్వారా ఆక్టివిటీస్ ను చేయాలని చూస్తున్న విలన్ ను హీరో ఎలా జయించాడు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తుంది. కాబట్టి ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ కంటే కూడా చాలా బాగుండబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే భారీ సక్సెస్ ను కూడా కొట్టబోతున్నట్టుగా ట్రేడ్ పండితులు ఇప్పటికే ఒక అంచనాకి వచ్చారు. అలాగే ఈ సినిమాలో రామ్ ఎనర్జీ, పూరి మార్క్ డైలాగ్స్, మేకింగ్ అన్ని కూడా చాలా బాగా వర్కవుట్ అయినట్టుగా తెలుస్తుంది…ఇక ఆగస్టు 15వ తేదీ వస్తేగానీ ఈ సినిమా రిజల్ట్ ఏంటి అనేది మనకు పూర్తిగా తెలియదు…