https://oktelugu.com/

Re Release Movies: రీ రిలీజ్ ల గోల ఏంటి? టాలీవుడ్ ఎందుకు ఈ ట్రెండ్ మొదలైంది..?

సినిమా ఇండస్ట్రీలో అభిమానులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వాళ్ళందరూ తమ అభిమాన హీరో సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఒక స్టార్ హీరో సినిమా సెట్స్ మీద ఉన్నప్పటికీ తన అభిమానులను దృష్టిలో ఉంచుకొని టీజర్, గ్లింప్స్ లాంటివి రిలీజ్ చేస్తూ ఉంటారు. వీటి ద్వారా ఫ్యాన్స్ లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలను పెంచుతూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 10, 2024 / 10:59 AM IST

    Re Release Movies

    Follow us on

    Re Release Movies: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలను రీ రిలీజ్ చేసే ట్రెండ్ అయితే బాగా నడుస్తుంది. ఇక రీసెంట్ గా మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా 2001 లో ఆయన హీరోగా, కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన ‘మురారి ‘ సినిమాని రీ రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాకి యూత్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి కూడా చాలా మంచి ఆదరణ దక్కింది. ఇక దీనికంటే ముందే మహేష్ బాబు ఒక్కడు,పోకిరి, అతడు సినిమాలు కూడా రీ రిలీజ్ చేయడం మనం చూసాము… మహేష్ బాబు అనే కాకుండా మిగతా హీరోలందరూ కూడా వాళ్ల సినిమాలను రీరిలీజ్ చేసి వాళ్ళ అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా ఆనందింపజేస్తున్నారు. నిజానికి ఈ రీరిలీజ్ లు చేయడం అవసరమా? అభిమానులు కూడా ఆల్రెడీ చూసిన సినిమాలను, యూట్యూబ్ లో అందుబాటు లో ఉన్న సినిమాలను మళ్లీ మళ్లీ చూసి వాళ్ల డబ్బులు వృధా చేసుకోవడం తప్ప రీ రిలీజ్ లో కొత్తగా ఏముంది? అంటూ కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

    నిజానికి మన స్టార్ హీరోలు ఒక సినిమాకి మరొక సినిమాకి మధ్య దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకోవడంతో వాళ్ల ఫ్యాన్స్ తమ హీరోని చాలా మిస్ అయిపోతున్నామని అనుకుంటున్నారు. ఇక దీంతో పెద్ద స్క్రీన్ మీద 4కె సౌండ్ ఎఫెక్ట్ తో మా హీరో సినిమాను చూసి ఆనందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. దీన్ని గమనించిన ప్రొడ్యూసర్స్ ఆయా స్టార్ హీరోల సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు…ఇక పవన్ కళ్యాణ్ సినిమా విషయానికి వస్తే ఆయన నటించిన సినిమాలు హిట్టు, ఫ్లాపు అని సంబంధం లేకుండా ప్రతి సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.

    ఇక దానికి కారణం ఆయన నుంచి ఒక కొత్త సినిమా రావడానికి చాలా రోజులు సమయం పడుతుంది. కాబట్టి అభిమానులు అప్పటిదాకా వేచి చూడలేకపోవడంతో ఆయన పాత సినిమాలను రీరిలీజ్ చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. దీనివల్ల ప్రొడ్యూసర్స్ హీరోలందరూ ప్రాఫిట్ లోనే ఉన్నప్పటికీ అభిమానులు మాత్రం చూసిన సినిమానే మళ్లీమళ్లీ చూసి తమ డబ్బులను వృధా చేసుకుంటున్నారు అంటూ ఇంకొంతమంది సినీ విమర్శకులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

    ఇక ఏది ఏమైనా కూడా అభిమానులు వాళ్ళ హీరోల సినిమాలను చూడడానికి వాళ్ళు వెచ్చించే డబ్బుల గురించి ఆలోచించడం లేదు. కేవలం ఎంటర్ టైన్ అవడానికి మాత్రమే రీ రిలీజ్ లను ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి సినిమా హీరోలు గాని, దర్శక నిర్మాతలు గాని సినిమాలను రీ రిలీజ్ చేయడం లో తప్పేమీ లేదు. ఇక ఇప్పటి వరకు రీ రిలీజ్ లు అయిన సినిమా విషయంలో కూడా మా హీరో సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే మా హీరో సినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది అంటూ అభిమానులు గొడవలు పడుతుండడం కూడా మనం గమనిస్తున్నాం… ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఈ రచ్చ అనేది భారీ ఎత్తున జరుగుతుంది…