Nag Ashwin: నాగ్ అశ్విన్ పెట్టిన పోస్ట్ కి సందీప్ రెడ్డి వంగ రియాక్షన్ ఏంటి..?

సందీప్ రెడ్డి వంగకి నాగ్ అశ్విన్ కి మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఆయన తనను విమర్శించాల్సిన అవసరం కూడా ఈయనకి లేదు. ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటారు. మరి ఇలాంటి సందర్భంలో సందీప్ రెడ్డి వంగ ను ఉద్దేశిస్తూ ఈయన అలాంటి కామెంట్స్ చేయడం ఎందుకు అనవసరంగా తన పరువు తను తీసుకోవడానికి తప్ప మరొకటి ఏమీ లేదు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

Written By: Gopi, Updated On : July 16, 2024 1:45 pm

Nag Ashwin

Follow us on

Nag Ashwin: కల్కి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్…ప్రస్తుత కల్కి 2 సినిమా చేసే పనిలో బిజీగా ఉన్నాడు. దానికి సంబంధించిన కథ మొత్తాన్ని ఫైనల్ చేసిన ఆయన తొందర్లోనే ఈ సినిమాను పట్టలెక్కించే పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన మరోసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక కల్కి సినిమా ఇప్పటికే 1000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలో ఆయన రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగను ఉద్దేశిస్తూ ఇన్ డైరెక్ట్ గా ఒక పోస్ట్ అయితే చేశాడు. ఇక దానికి సందీప్ రెడ్డి వంగ నుంచి ఎలాంటి రియాక్షన్ అయితే రాలేదు.

కానీ ఆ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ నాగ్ అశ్విన్ ను ఉద్దేశిస్తూ చాలా విమర్శలైతే చేస్తున్నారు. నిజానికి సందీప్ రెడ్డి వంగకి నాగ్ అశ్విన్ కి మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఆయన తనను విమర్శించాల్సిన అవసరం కూడా ఈయనకి లేదు. ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటారు. మరి ఇలాంటి సందర్భంలో సందీప్ రెడ్డి వంగ ను ఉద్దేశిస్తూ ఈయన అలాంటి కామెంట్స్ చేయడం ఎందుకు అనవసరంగా తన పరువు తను తీసుకోవడానికి తప్ప మరొకటి ఏమీ లేదు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…

Nag Ashwin

ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ కూడా ఈ విషయం మీద స్పందించడానికి పెద్దగా ఆసక్తి అయితే చూపించడం లేదట. ఎందుకంటే ఇలాంటి విమర్శలు ఆయన మీద ఎన్నో వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. ఆయన వాటిని లైట్ తీసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నాడట. ఇక మొన్నటి దాకా బాలీవుడ్ ఇండస్ట్రీ తో పోరాటం చేసిన సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు మన ఇండస్ట్రీ వాళ్ళతో కూడా ఇలాంటి మాటలు పడాల్సి వస్తుందనే ఒక ఆలోచనలో అయితే తను ఉన్నాడట. కాబట్టి ఇలాంటి వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే తను ‘అనిమల్ ‘ సినిమా తీశాడు అది ప్రేక్షకులకు రీచ్ అయింది. వాళ్ళు దానిని సూపర్ సక్సెస్ చేసి ఆ సినిమాకి 950 కోట్ల కలెక్షన్లను కట్టబెట్టారు. కాబట్టి అది సూపర్ హిట్ గా నిలిచింది. ఇక అయిపోయిన దాని గురించి మళ్ళీ మాట్లాడుకోవడం ఎందుకు అనే విధంగా సందీప్ తన వైఖరిని మార్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే సందీప్ అనుకున్నదే నిజం…సినిమా వచ్చింది సక్సెస్ అయింది. ఇక దాని గురించి మళ్ళీ డిస్కషన్ పెట్టుకోవడం కూడా అనవసరం అలాంటి మినిమం కామన్ సెన్స్ లేకుండా ఆయన గురించి ఒక పోస్ట్ పెట్టడం అనేది నిజంగా ఆ కల్కి సినిమా వల్ల నాగీ లో వచ్చిన గర్వాన్ని చూపిస్తుందనే చెప్పాలి…

నిజానికి కల్కి సినిమా పెద్ద తోపు సినిమా అయితే కాదు. ఏదో విజువల్ గా ఓకే అనిపించింది తప్ప కంటెంట్ పరంగా అయితే సినిమాలో చాలా బొక్కలు ఉన్నాయనే చెప్పాలి… ఇక మరి కొంతమంది అయితే ఈ సినిమాకు వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాలేదు. అయినప్పటికీ వచ్చినట్టుగా అనౌన్స్ చేసుకుంటున్నారు ఇది పబ్లిసిటీలో ఒక ట్రిక్ అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగ ను టార్గెట్ చేసి తనే చిక్కుల్లో పడ్డాడు అంటూ ఇంకొంతమంది సినీ పండితులు సైతం నాగ్ అశ్విన్ మీద ఫైర్ అవుతున్నారు…