https://oktelugu.com/

Rajamouli: రాజమౌళి ఇండియా లో నెంబర్ వన్ డైరెక్టర్ అయినా కూడా డౌన్ టు ఎర్త్ ఉండటానికి కారణం ఏంటంటే..?

రాజమౌళి ఎక్కడ కూడా తన పొగరును కానీ మిగతా వాళ్ళని తక్కువ చేసి చూడడం గానీ మనకు కనిపించవు. ఆయన ఏ ఫంక్షన్ కి పిలిచిన ఆయన చాలా డీసెంట్ గా వచ్చి అటెండ్ అయి ఆ ఈవెంట్ కి సంబంధించిన మాటలను మాట్లాడి వెళ్ళిపోతాడు. అంతే తప్ప ఒకరిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడడం కానీ వాళ్ల గురించి తప్పుడు పోస్టులు పెట్టడం కానీ ఇప్పటివరకు అయితే జరగలేదు.

Written By:
  • Gopi
  • , Updated On : July 16, 2024 1:54 pm
    Rajamouli

    Rajamouli

    Follow us on

    Rajamouli: ఈరోజుల్లో సినిమా ఇండస్ట్రీలో ఒకటి, రెండు సక్సెస్ లు వస్తేనే హీరోలు గానీ, దర్శకులు గాని అసలు ఎక్కడ ఆగకుండా ఆకాశమే హద్దుగా పార్టీలు చేసేసుకుంటూన్నారు. ఇక ఆ దర్శకులు మనల్ని మించిన డైరెక్టర్స్ ఇండస్ట్రీలో మరొకరు లేరు అనేంతలా పొగరుతో వ్యవహరిస్తున్న వాళ్ల తీరు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇలాంటి సందర్భంలో కూడా రాజమౌళి చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా 100% సక్సెస్ రేట్ తో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న దర్శకుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు.

    మరి అలాంటి రాజమౌళి ఎక్కడ కూడా తన పొగరును కానీ మిగతా వాళ్ళని తక్కువ చేసి చూడడం గానీ మనకు కనిపించవు. ఆయన ఏ ఫంక్షన్ కి పిలిచిన ఆయన చాలా డీసెంట్ గా వచ్చి అటెండ్ అయి ఆ ఈవెంట్ కి సంబంధించిన మాటలను మాట్లాడి వెళ్ళిపోతాడు. అంతే తప్ప ఒకరిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడడం కానీ వాళ్ల గురించి తప్పుడు పోస్టులు పెట్టడం కానీ ఇప్పటివరకు అయితే జరగలేదు. ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఒదిగే ఉంటాడు. కాబట్టే ఆయనకు చాలామంది అభిమానులైతే ఉన్నారు. ప్రతి డైరెక్టర్ కూడా రాజమౌళిని బీట్ చేయాలనే ఉద్దేశ్యంతోనే సినిమాలు చేస్తుంటారు. కానీ రాజమౌళి మాత్రం ఎవరికీ అందనంత ఎత్తులో సినిమాలు చేసుకుంటూ తన రికార్డ్ లను తనే బ్రేక్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. దీనివల్ల రాజమౌళితో అటు హీరోలకి గాని, డైరెక్టర్లకు గాని సత్ సంబందాలైతే ఉన్నాయి.

    Also Read: మాల్వి మల్హోత్రా ఆ ప్రొడ్యూసర్ ని ఛీట్ చేసిందా… రాజ్ తరుణ్-లావణ్య వివాదంలో కొత్త మలుపు, హీరోయిన్ పై మరో కేసు నమోదు!

    కానీ కొంతమంది ఒకటి రెండు సక్సెస్ లు రాగానే మేమే తోపులం మమ్మల్ని మించిన వాళ్లు ఎవరూ లేరు అనే అహంభావంతో ఇతరుల పైన కామెంట్లు అయితే చేస్తూ ఉంటారు. అలాంటివాళ్లు ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు కొనసాగలేరనేది మాత్రం వాస్తవం.. ఎందుకంటే మనం ఎలాంటి సినిమా తీసిన కూడా ఇతరుల సినిమాలను ఆదరించాలి. వాళ్ళు చేసిన సినిమాలు నచ్చకపోతే చూడకుండా మానేస్తే సరిపోతుంది. కానీ ఇతరులపై కామెంట్స్ చేయడం అనేది సమంజసమైన విషయం అయితే కాదు. ఈమధ్య కొంతమంది దర్శకులు, హీరోలు మిగితా దర్శకుల మీద గాని, హీరోల మీద గాని కామెంట్లైతే చేస్తున్నారు.

    ఇక అలాంటివి చేయడం వల్ల ఆ కామెంట్స్ చేసిన దర్శకులకు వచ్చే మైలేజీ కంటే కూడా జనంలో వాళ్ల పట్ల ఏహ్య భావం అయితే కలుగుతుంది. మరి ఇప్పటికైన దర్శకులు, హీరోలు రాజమౌళి వెళ్తున్నటువంటి ఒక సిస్టమెటిక్ పద్ధతిలో వెళితే సక్సెస్ లు గానీ, గుర్తింపు గానీ రావడమే కాకుండా జనాల్లో కూడా మంచి పేరు దక్కుతుంది. ఇక ఇదిలా ఉంటే అల్టిమేట్ గా ఇండస్ట్రీ లో సినిమాలు సక్సెస్ అవ్వడం ఒకటే ఫైనల్ కాదు. ముందుగా వాళ్ల వ్యక్తిత్వం బాగుండాలి, వ్యక్తిత్వం బాగుంటేనే సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన ఆ దర్శకులకు ఇండస్ట్రీలో ఒక విలువ అయితే ఇస్తారు.

    అంతే తప్ప గర్వంతో తలేగిరేసి మాకంటే పోటుగాడు ఎవడు లేడు అని అనుకుంటే మాత్రం ఎంత తొందరగా సక్సెస్ అయ్యారో అంతే తొందరగా వాళ్ళు షెడ్డు కు వెళ్ళిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… రాజమౌళి వ్యక్తిత్వం వల్లే ఆయన ఇన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇక ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు…ఈ సినిమా కోసం ఏకంగా 1200 కోట్ల వరకు బడ్జెట్ ను కూడా కేటాయించారు. ఇక ఇండియాలోనే ఇంత భారీ బడ్జెట్ తో ఇంత వరకు సినిమా అయితే రాలేదు…కాబట్టి ఈ సినిమా ఇండియా లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగా మనం చెప్పుకోవచ్చు…

     

    Also Read: నాగ్ అశ్విన్ పెట్టిన పోస్ట్ కి సందీప్ రెడ్డి వంగ రియాక్షన్ ఏంటి..?