Ghilli: ఒక్కడు రీమేక్ గిల్లి కి రీ రిలీజ్ లో అన్ని కోట్లు వచ్చాయా..?

Ghilli: ఒక్కడు రీమేక్ గిల్లి కి రీ రిలీజ్ లో అన్ని కోట్లు వచ్చాయా..?

Written By: Gopi, Updated On : June 16, 2024 2:08 pm

Ghilli

Follow us on

Ghilli: మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడు ‘ సినిమా ఆయన కెరియర్ లోనే మొదటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. అయితే అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. 2003లో వచ్చిన ఈ సినిమా మహేష్ బాబుని సూపర్ స్టార్ ను చేయడంలో కీలకపాత్ర వహించింది. అయితే ఈ సినిమా ఇక్కడ సూపర్ సక్సెస్ అయిన తర్వాత ఈ సినిమాను కోలీవుడ్ లో విజయ్ హీరోగా ‘గిల్లి ‘ అనే పేరుతో రీమేక్ చేశారు.

ఇక మొత్తానికైతే ఈ మూవీ అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే కొద్దిరోజుల కిందట ఈ సినిమాని రీ రిలీజ్ చేశారు. అయితే రీ రిలీజ్ లో ఏ సినిమా దక్కించుకోని విజయాన్ని ఈ సినిమా అందుకొవడమే కాకుండా కలెక్షన్ల వర్షాన్ని కూడా కురిపించినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా రీరిలీజ్ లోనే దాదాపు 50 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి ఇప్పటివరకు ఏ సినిమా రీ రిలీజ్ కి రానన్ని వసూళ్లను రాబట్టిందనే చెప్పాలి.

ఇక మొత్తానికైతే ఈ సినిమా వసూళ్లను చూస్తుంటే తమిళంలో విజయ్ కి ఉన్న క్రేజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్లే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రజెంట్ విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇక అందులో భాగంగానే విజయ్ ఒక పొలిటికల్ పార్టీని కూడా స్థాపించాడు. ఇక రాజకీయ ఎంట్రీ ఇస్తున్న విజయ్ ఇక మీదట సినిమాలకు స్వస్థి చెప్పి పాలిటిక్స్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో జనసేన అనే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ అయినట్టుగా తమిళనాడు లో విజయ్ సక్సెస్ అవుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…