https://oktelugu.com/

Salaar: సలార్ లో ప్రభాస్ నడిపిన బైక్ కావాలా? ఇలా చేయండి

సలార్ 2 పూర్తి చేసిన తర్వాత మిగిలిన ప్రాజెక్టులను పట్టాలెక్కించాలి అనుకుంటున్నారట ప్రభాస్. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా వరకు కూడా ప్రభాస్ ఫ్లాపులతోనే బాధ పడ్డారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 19, 2024 / 04:20 PM IST

    Salaar

    Follow us on

    Salaar: ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ భారీ యాక్షన్ సినిమా ఏ రేంజ్ లో హిట్ ను సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా బంపర్ ఆఫర్ ను కొట్టేసింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 650 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతేకాదు నైజాంలో సలార్ రికార్డు క్రియేట్ చేసింది. రూ. 100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి వావ్ అనిపించుకుంది సలార్. ఈ సినిమా ఓటీటీలోనే కాదు టీవీ తెర మీద కూడా ప్రేక్షకులను మెప్పించడానికి సిద్దం అవుతుంది.

    ఈ ఏప్రిల్ 21న స్టార్ మా లో సాయంత్రం 5.30 గం.కు ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ఓ ప్రకటన కూడా చేసింది స్టార్ మా. అందులో బంపర్ ఆఫర్ ను ప్రకటించింది కూడా. ఈ ప్రకటన లో ప్రభాస్ వాడిన ఐకానిక్ బైక్ ను గెలుచుకునే అవకాశం ప్రేక్షకులకు ఇచ్చింది. స్టార్ మా లో సలార్ సినిమా ప్రసారమయ్యే సమయంలో కొన్ని ప్రశ్నలు అడుగుతారట. సరిగ్గా సమాధానం చెప్పిన వారికి ఈ బైక్ ను పొందే అవకాశం కల్పించారు. మరి చూడాలి ప్రభాస్ వాడిన ఈ బైక్ ను ఎవరు సొంతం చేసుకుంటారు అనేది..

    సలార్ సినిమాకు సీక్వెల్ గా పార్ట్ 2, సలార్ శౌర్యంగ పర్వం అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సీక్వెల్ పై అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా గురించి అభిమానులు చాలా ఎదురుచూస్తున్నారు కూడా. కానీ ఈ సినిమా ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదట. కానీ తాజా సమాచారం మేరకు ఈ సినిమా పార్ట్ 2 మే నెల మొదటి వారంలో ప్రారంభం అవుతుందట. అంతేకాదు వచ్చే సంవత్సరం అంటే 2025 లోనే సలార్ 2 ప్రేక్షకుల ముందుకు రానుందట. దీనికి సంబంధించి ఓ ప్రకటన కూడా రానుందట.

    సలార్ 2 పూర్తి చేసిన తర్వాత మిగిలిన ప్రాజెక్టులను పట్టాలెక్కించాలి అనుకుంటున్నారట ప్రభాస్. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా వరకు కూడా ప్రభాస్ ఫ్లాపులతోనే బాధ పడ్డారు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, లు ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదు. సలార్ సినిమాతో మరోసారి ఆయన క్రేజ్ ను తిరిగి పొందారు. ఇక సలార్ 2 ఎలా ఉండనుందో చూడాలి.