Varsham: తమిళ హీరోయిన్ త్రిష గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి తెలుగు హీరోయిన్ అనే మాదిరి పేరు సంపాదించింది. తెలుగులో టాప్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా నిలించింది త్రిష. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన త్రిష మళ్లీ దూసుకొని పోతుంది. నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో పరిచయమై వర్షం సినిమాతో ఫుల్ పాపులారిటీని సంపాదించింది. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారల్లో ఒకరిగా పేరు సంపాదించింది.
వర్షం సినిమాలో ప్రభాస్ సరసన నటించి సూపర్ హిట్ ను సంపాదించింది త్రిష. ఈ సినిమా ఆమె కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాకు శోభన్ దర్శకత్వం వహిస్తే గోపీచంద్ విలన్ గా నటించారు. ఈ సినిమాలో ప్రభాస్, త్రిషల కెమెస్ట్రీ హైలెట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకు మొదటగా త్రిషను అనుకోలేదట. త్రిష స్థానంలో అప్పట్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న అదితి అగర్వాల్ ను అనుకున్నారట. అప్పటికే ఈ అమ్మడు గంగోత్రి సినిమాతో ఫుల్ పేమ్ లో ఉంది.
ఏవో కారణాల వల్ల అదితి స్థానంలో త్రిష వచ్చి చేరింది. దీంతో బంపర్ హిట్ వచ్చి చేరింది త్రిష ఖాతాలో. ఇదిలా ఉంటే త్రిష కొన్ని సినిమాల తర్వాత ఇండస్ట్రీలో కనిపించకుండా పోయింది. మళ్లీ రీసెంట్ గా మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించి సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా విజయవంతంగా ప్రారంభించింది. ఈ సినిమా రెండు పార్టులుగా రావడంతో త్రిష పేరు దద్దరిల్లింది. ఈ సినిమా తర్వాత తమిళ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు వస్తున్నాయి అమ్మడుకు.
లియో సినిమాలో కూడా మంచి పేరు సంపాదించింది త్రిష. ఇక స్టాలిన్ సినిమాతో చిరంజీవితో జతకట్టిన త్రిష మరోసారి విశ్వంభర సినిమాతో జతకట్టనుంది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత త్రిష తెలుగులో నటిస్తుంది. ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహిస్తే కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు త్రిష భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటుందట. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి.