https://oktelugu.com/

Gangs Of Godavari Movie Review: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఫుల్ మూవీ రివ్యూ…

విశ్వక్ సేన్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకున్నాడా.? లేదా మాస్ హీరోగా ఎదగాలన్న విశ్వక్ సేన్ కల ఈ సినిమా ద్వారా నెరవేరిందా లేదా అనే విషయాలు మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకుందాం...

Written By:
  • Gopi
  • , Updated On : May 31, 2024 / 08:49 AM IST

    Gangs Of Godavari Movie Review

    Follow us on

    Gangs Of Godavari Movie Review:  మాస్ కా దాస్ గా పేరు సంపాదించుకున్న విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతూ చాలా ఫాస్ట్ గా సినిమాలను చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇంకా ఈ సంవత్సరం ఇప్పటికే గామి అనే సినిమాని రిలీజ్ చేసి ఆ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. అయితే ఇప్పుడు ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ అనే సినిమాతో మరోసారి హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పరిస్థితి ఏంటి.? విశ్వక్ సేన్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకున్నాడా.? లేదా మాస్ హీరోగా ఎదగాలన్న విశ్వక్ సేన్ కల ఈ సినిమా ద్వారా నెరవేరిందా లేదా అనే విషయాలు మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకుందాం…

    కథ

    ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే పనీ పాటా లేకుండా తిరిగే ఒక కుర్రాడు ఊళ్లో ఉన్న పాలిటిక్స్ ద్వారా జరుగుతున్న అన్యాయాలను చూస్తూ తట్టుకోలేక తను పాలిటిక్స్ లోకి ఎంటర్ అయి రాజకీయం అనే వ్యవస్థని మార్చాలనే ఉద్దేశ్యంతో రంగం లోకి దిగుతాడు. మరి మొత్తానికైతే ఆయన అనుకున్న విధంగానే చేయగలిగాడా లేదా అతను ప్రేమించిన అమ్మాయి అతనికి సొంతం అయ్యిందా లేదా అనే అంశాలతో ఈ సినిమా కథ సాగుతుంది. ఇక ఫైనల్ గా ఈ కథ ఎక్కడికి చేరుకుంది అనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే డైరెక్టర్ కృష్ణ చైతన్య ఈ సినిమాని చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లడానికి ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఇంతకుముందు తను చేసిన రౌడీ ఫెల్లో, చల్ మోహన్ రంగ సినిమాలతో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్ సినిమా అనే చెప్పాలి. ఇక ఈ సినిమాని మాస్ యాంగిల్ లో ఎంచుకొని మాస్ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక విశ్వక్ సేన్ కూడా ఎక్కడ తగ్గకుండా ఈ సినిమాని తన భుజాల మీద మోసుకెళ్లాడనే చెప్పాలి. ఈ సినిమా స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా సీన్లు రాసుకోవడం అనేది నార్మల్ విషయం కాదు. అయితే ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ లో మొదట క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ కోసం కొంతవరకు టైం తీసుకున్నా కూడా మొదటి హాఫన్ అవర్ గడిచిన తర్వాత మాత్రం సినిమా చాలా ఫాస్ట్ గా వెళ్తుంది.

    ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. ఇక ఇంటర్వెల్ తర్వాత సినిమా కొంచెం స్లో గా స్టార్ట్ అయినప్పటికీ మళ్ళీ ఒక హాఫన్ అవర్ తర్వాత సినిమాని పరుగులు పెట్టించారనే చెప్పాలి. ఇక మొత్తానికైతే తన కెరియర్లో ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒక డీసెంట్ హిట్ గా మిగులుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక కృష్ణ చైతన్య రాసుకున్న కథ బావుంది, ఏ క్యారెక్టర్ ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకొని సినిమా మీద ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరిలో అటెన్షన్ ని కూడా రాబట్టగలిగాడు. ఇక ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా వరకు హెల్ప్ అయింది. ఇక డైలాగులు కొంచెం ఓవర్ ద టాప్ వెళ్ళినప్పటికి ఆ పర్టికులర్ సిచ్వేషన్ లో ప్రేక్షకుడిని మాత్రం ఎంటర్ టైన్ అయితే చేయగలుగుతాయి. చూస్తే ఇవి కొంచెం బూతుల్లా కనిపించినప్పటికీ ఆ సిచువేషన్ లో మాత్రం వాటి వల్ల ప్రేక్షకుల్లో మంచి ఊపు అయితే వస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఇంతకుముందు తను చేసిన సినిమాలన్నింటి కంటే కూడా ఇందులో చాలా భిన్నమైన శైలిని కనబరచడనే చెప్పాలి. ఇక నేహా శెట్టి కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. ఇక ఇప్పటివరకు తను పోషించిన పాత్ర కాకుండా దీంట్లో ఒక డిఫరెంట్ పాత్రలో నటించి మెప్పించాడు. అలాగే అంజలి కూడా ఈ సినిమాలో విశ్వక్ సేన్ కి సపోర్టుగా నటించి కొన్ని సీన్లని ఎలివేట్ చేయడంలో తను చాలావరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. నాజర్ కూడా తనదైన పాత్రలో నటించి మెప్పించాడు. ఇక మిగిలిన ఆర్టిస్తులందరు కూడా వాళ్ల పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు.

    టెక్నికల్ అంశాలు

    ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అనేది చాలావరకు హెల్ప్ అయింది. ఒకటి రెండు సాంగ్స్ అయితే అద్భుతంగా ఉండడమే కాకుండా ప్రేక్షకుల్లో మంచి అటెన్షన్ అయితే క్రియేట్ చేశాయి. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే ఈ సినిమాలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అదరగొట్టారనే చెప్పాలి. ఇక ఈ సినిమా సక్సెస్ లో ఇవి చాలా కీలకపాత్ర వహించాయి. విజువల్స్ కూడా ఈ సినిమాకి మరో ప్రధానమైన ఆకర్షణ గా నిలిచాయి. ఇక ఇంతకుముందు సినిమాలా మాదిరిగా కాకుండా ఈ సినిమా లో విశ్వక్ సేన్ చాలా అందంగా కనిపించాడు. అలాగే తన క్యారెక్టర్ లో ఉన్న వేరియేషన్స్ ని చూపిస్తు నటించడం లో తను 100% సక్సెస్ అయ్యాడు… ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళ అందించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి…

    ప్లస్ పాయింట్స్

    విశ్వక్ సేన్
    కొన్ని డైలాగ్స్

    మైనస్ పాయింట్స్

    స్క్రీన్ ప్లే..
    కొన్నిచోట్ల డైరెక్షన్ కూడా మైనస్ అయింది..
    స్లో నరేషన్…

    రేటింగ్

    ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2.75/5

    చివరి లైన్
    మాస్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది.