https://oktelugu.com/

Vijay Sethupathi: ఎన్టీయార్ సినిమాలో విజయ్ సేతుపతి..క్యారెక్టర్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు…

విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఎన్టీఆర్ కి అన్నగా కనిపించబోతున్నాడట. ఇక వీళ్లిద్దరి క్యారెక్టర్లు కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : June 19, 2024 / 01:12 PM IST

    Vijay Sethupathi

    Follow us on

    Vijay Sethupathi: నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమాతోనే డిజాస్టర్ ని అందుకున్నప్పటికీ ఆ తర్వాత చేసిన “స్టూడెంట్ నెంబర్ వన్” సినిమా నుంచి మంచి విజయాలను అందుకుంటు స్టార్ గా ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు స్టార్ హీరోలేవ్వరికి సాధ్యం కానీ విధంగా వరుసగా ఆరు విజయాలను సాధించి నాకు ఎవరు పోటీ లేరు అని చెబుతూనే తన ప్రస్థానాన్ని ముందుకు కొనసాగిస్తున్నాడు.

    ఇక ఇప్పుడు దేవర సినిమాతో ఏడో సక్సెస్ ను కూడా అందుకొని ఇండస్ట్రీలో ఎవరికి దక్కని ఒక అరుదైన రికార్డు ను కూడా తన పేరు మీద నమోదు చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూటింగ్ మొత్తాన్ని ఫినిష్ చేసి ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో విజయ్ సేతుపతి నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

    ఇక విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఎన్టీఆర్ కి అన్నగా కనిపించబోతున్నాడట. ఇక వీళ్లిద్దరి క్యారెక్టర్లు కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ప్రశాంత్ నీల్ ఇప్పటికే కథ మొత్తం ఫైనల్ చేసి బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడట…అయితే వచ్చే సంవత్సరం స్టార్టింగ్ లో ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకు వెళ్లడానికి రెడీగా ఉన్నాడు.

    ఇక ఎన్టీఆర్ కోసమే ప్రశాంత్ నీల్ సలార్ 2 ని కూడా పోస్ట్ పోన్ చేసి ఈ సినిమా మీదనే ఎక్కువ వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి సలార్ 2 సినిమా ఎప్పుడు ఉంటుంది అనే విషయం మీద సరైన క్లారిటీ లేదు. కానీ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా మాత్రం తొందర్లోనే సెట్స్ మీదకి వెళ్ళే అవకాశాలైతే ఉన్నాయి…