Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న పుష్ప 2 సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుంది అనే అంచనాలైతే అందరిలో ఉన్నాయి. అయితే ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీకి పోస్ట్ పోన్ చేయడం అనేది కొంతమందిలో నిరుత్సాహాన్ని కలిగించినప్పటికీ సినిమా అవుట్ పుట్ కోసం తప్పట్లేదు అని మేకర్స్ చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి భారీ ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఆగస్టు 15వ తేదీన సినిమా రిలీజ్ అవుతున్నట్టుగా భావించిన వాళ్లు సినిమా రైట్స్ ని తీసుకున్నారు.
మరి ఇప్పుడు పోస్ట్ పోన్ చేయడంతో వారి నుంచి కొంతవరకు వ్యతిరేకత అయితే వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంట్లో భాగంగానే కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఆ సినిమాని తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. మరి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి సరైన రెస్పాన్స్ రాకపోతే మైత్రి మూవీ మేకర్స్ వారే ఓన్ రిలీజ్ చేసుకుంటారా లేదంటే ఇంకేవరికైనా డిస్ట్రిబ్యూషన్ ను అప్పగిస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాలను మినహాయిస్తే మిగిలిన రాష్ట్రాలలో సినిమా రిలీజ్ డేట్ మార్చడం అలాగే రైట్స్ కోసం భారీ డబ్బులు డిమాండ్ చేయడం తో డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ల నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో ఎదురయ్యే విపత్తుల మీద సినిమా మేకర్స్ ఎలా స్పందిస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ మైత్రి మూవీ మేకర్స్ వారు ఓన్ గా ఈ సినిమాను రిలీజ్ చేసుకుంటే మాత్రం ఆ సినిమా తేడా కొడితే వాళ్లకు భారీగా నష్టం వస్తుంది.
ఎందుకంటే ఈ సినిమా మీద పెట్టిన డబ్బులతో పాటు డిస్ట్రిబ్యూషన్ కూడా వాళ్లే చేసుకుంటే అది కూడా వాళ్లే భరించాల్సి ఉంటుంది. కాబట్టి భారీ ఎత్తున నష్టాలు వచ్చే అవకాశాలు ఉండటంతో ఇప్పుడు ఏం చేయాలనే ఉద్దేశ్యం తో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది…