Homeబాలీవుడ్Tanushree Dutta: ఆషిక్ బనాయా సాంగ్ లో మాది బ్రదర్ అండ్ సిస్టర్ కెమిస్ట్రీ... తనుశ్రీ...

Tanushree Dutta: ఆషిక్ బనాయా సాంగ్ లో మాది బ్రదర్ అండ్ సిస్టర్ కెమిస్ట్రీ… తనుశ్రీ దత్త షాకింగ్ కామెంట్స్

Tanushree Dutta: నైంటీస్ కిడ్స్ కి నిద్రలేకుండా చేసిన పాట ‘ఆషిక్ బనాయా ఆప్నే’. ఇమ్రాన్ హష్మీ-తనుశ్రీ దత్త నటించిన ఈ సాంగ్ రొమాంటిక్ సాంగ్స్ కి రిఫరెన్స్ గా నిలిచింది. ఇమ్రాన్ హష్మీ అంటే ముద్దు సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. లిప్ లాక్ సన్నివేశాలకు అతడు పెట్టింది పేరు. అలాంటి హీరో తనుశ్రీ దత్తతో మేమకమై నటించాడు. ఈ సాంగ్ కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. ఇమ్రాన్ హష్మీ అదృష్టానికి యూత్ కుళ్ళుకుంటారు.

ఇక తనుశ్రీ దత్త మొహమాటం లేకుండా రొమాన్స్ కురిపించింది. ఆమె నటన చాలా సహజంగా సాగుతుంది. నిజంగా ఒకరంటే ఒకరు విపరీతంగా ఇష్టపడుతున్న అమ్మాయి-అబ్బాయి మాదిరి మమేకమై నటించారు. తనుశ్రీ దత్త ఈ సాంగ్ లో టాప్ లెస్ గా కనిపిస్తుంది. ఇలాంటి రొమాంటిక్ సాంగ్ ని ఉద్దేశించి తనుశ్రీ దత్త చేసిన కామెంట్స్ మైండ్ బ్లాక్ చేశాయి. తాజా ఇంటర్వ్యూలో తనుశ్రీ దత్త మాట్లాడుతూ… ఆషిక్ బనాయా ఆప్నే సాంగ్ లో ఇమ్రాన్ హష్మీ, నాకు మధ్య కెమిస్ట్రీ ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లాంటిది, అన్నారు.

రొమాంటిక్ సాంగ్ లో రెచ్చగొట్టే సన్నివేశాల్లో నటించిన తనుశ్రీ దత్త… అది బ్రదర్ అండ్ సిస్టర్ తరహా కెమిస్ట్రీ అని చెప్పడం అందరి మతులు పోగొడుతుంది. అలాంటి సాంగ్ ని పవిత్రమైన బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ తో ఆమె ఎలా పోల్చారు అనేది అర్థం కాలేదు. ఆషిక్ బనాయా ఆప్నే చిత్రానికి ఆదిత్య దత్ దర్శకుడు. ఇమ్రాన్ హష్మీ, తనుశ్రీ దత్త, సోనూ సూద్ ప్రధాన పాత్రలు చేశారు.

కాగా తెలుగులో తనుశ్రీ దత్త కేవలం ఒకే ఒక మూవీ చేసింది. బాలకృష్ణకు జంటగా వీరభద్ర చిత్రంలో నటించింది. ఈ మూవీ డిజాస్టర్ కావడంతో తెలుగులో ఆమెకు మరలా ఆఫర్స్ రాలేదు. హీరోయిన్ గా తనుశ్రీ దత్త కెరీర్ ఏమంత ఆశాజనకంగా సాగలేదు. నటుడు నానా పటేకర్ పై తనుశ్రీ దత్త లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. హార్న్ ఓకే ప్లీస్ మూవీస్ సెట్స్ లో నానా పటేకర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

 

Aashiq Banaya Aapne Title (Full Song) | Himesh Reshammiya,Shreya Ghoshal | Emraan Hashmi,Tanushree D

Exit mobile version