https://oktelugu.com/

Vijay Devarakonda: డ్యూయల్ రోల్ లో నటించడానికి సిద్ధమవుతున్న విజయ్ దేవరకొండ…

గౌతమ్ తిన్ననూరు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక దాంతో పాటుగా రీసెంట్ గా 'రాజావారు రాణి గారు' అనే సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న రవి కిరణ్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.

Written By:
  • Gopi
  • , Updated On : May 12, 2024 / 11:24 AM IST

    Vijay Devarakonda

    Follow us on

    Vijay Devarakonda: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ… ఈయన చేసిన గీతా గోవిందం సినిమా 100 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ఆయన్ని స్టార్ హీరోగా నిలబెట్టింది. ఇక ఇప్పుడు ఈయన చేస్తున్న సినిమాలు ఏవి కూడా అంత పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు ఆచితూచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ ముందుకెళుతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇప్పటికే ఈయన గౌతమ్ తిన్ననూరు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక దాంతో పాటుగా రీసెంట్ గా ‘రాజావారు రాణి గారు’ అనే సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న రవి కిరణ్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా సినిమా యూనిట్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు రాహుల్ సాంకృత్యాయన్ డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి కూడా సిద్ధమయ్యాడు. ఇక ఇప్పటికే ఆయన దర్శకత్వంలో ‘టాక్సీవాలా ‘ అనే సినిమా చేశాడు.

    ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు మరోసారి ఆయన దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యాడు అయితే ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా కోసం 120 కోట్ల బడ్జెట్ ని కూడా కేటాయించినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో తండ్రీ కొడుకులు గా విజయ్ దేవరకొండ నటించి మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇది పీరియాడికల్ డ్రామా ఫిల్మ్ గా కూడా తెరకెక్కబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది.

    ఇక మొత్తానికైతే ఈ మూడు సినిమాలతో విజయ్ దేవరకొండ మరోసారి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ మూడు సినిమాలతో తను అనుకున్న సక్సెస్ సాధిస్తాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…