https://oktelugu.com/

Venu Swamy: ప్రభాస్ తో పెట్టుకున్నాడు.. వేణు స్వామి పని అయిపోయినట్టే

ఎంతో మందికి టార్గెట్ అవుతున్న వేణుస్వామి మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ కి టార్గెట్ అయ్యాడు. ప్రభాస్ ఫ్యాన్స్ కు వేణు స్వామికి పచ్చిగడ్డిలో నిప్పు వేస్తే మండేంత కోపం ఉంటుంది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ జాతకం బాగాలేదని.. అనారోగ్య సమస్యలు వస్తాయని.. ఆయన సినీ జీవితం ముగిసినట్టే అన్నారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : June 28, 2024 / 02:50 PM IST

    Venu Swamy

    Follow us on

    Venu Swamy: అందరికీ జ్యోతిష్యం చెప్పి వార్తల్లో నిలిచే వేణుస్వామికి ఈ సారి సమయం బాగలేనట్టుగానే ఉంది. ఈయన చెప్పిన ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, ఐపీఎల్ లో సన్ రైజర్స్ ఓటమి అంటూ ఆయన చెప్పిన జ్యోతిష్యం వట్టిదే అయింది.ఇక ఏపీ ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్ గెలుస్తారు అన్నారు. కానీ ఇక్కడ సీన్ కూడా రివర్స్ అయింది. దీంతో ఈయన మీద విమర్శలు వస్తున్నాయి. జ్యోతిష్యం ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు కొందరు. ఏకంగా జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పీ అయితే వేణుస్వామి పెద్ద డెకాయిట్ అన్నాడు.

    ఎంతో మందికి టార్గెట్ అవుతున్న వేణుస్వామి మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ కి టార్గెట్ అయ్యాడు. ప్రభాస్ ఫ్యాన్స్ కు వేణు స్వామికి పచ్చిగడ్డిలో నిప్పు వేస్తే మండేంత కోపం ఉంటుంది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ జాతకం బాగాలేదని.. అనారోగ్య సమస్యలు వస్తాయని.. ఆయన సినీ జీవితం ముగిసినట్టే అన్నారు. అన్నట్టుగానే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్‌‌లు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే సలార్ రిలీజ్‌కు ముందు కూడా .. ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందని, ఎవ్వరూ ఆశలు పెట్టుకోవద్దని చెప్పారు వేణుస్వామి.

    ఆయన మాటలకు విరుద్దంగా సలార్ రిలీజైన తర్వాత తొలిరోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ వేణుస్వామిని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. కానీ వేణుస్వామి వెంటనే కౌంటర్ ఇచ్చారు. సలార్ అభిమానులకు మాత్రమే హిట్ అని, నిజానికి అది ఫ్లాప్ సినిమా అన్నారు.. సలార్‌తో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాత సెటిల్ చేశాడని ఓ వార్త వైరల్ గా మారింది. దీంతో ఈ విషయం నేను ముందే చెప్పాను అంటూ వైరల్ చేశారు వేణుస్వామి.

    ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మార్నింగ్ షో నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. అంతేకాదు వసూళ్ల సునామీ కూడా ఖాయం అంటున్నారు ట్రేగ్ వర్గాలు. అవలీలగా రూ.1000 కోట్లు పక్కా అంటున్నారు. ఇక వెంటనే మరోసారి ప్రభాస్ అభిమానుకు దొరికిపోయారు వేణుస్వామి. మా హీరో కెరీర్ ఖతం అన్న పెద్దమనిషి కెరీర్ ఏంటో ఇప్పుడు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

    ముందు తన జాతకం చూసుకోవాల్సిన అవసరం వచ్చిందంటూ మండిపడుతున్నారు. వేణుస్వామి జాతకం ప్రకారం ఆయనకు ఏలినాటి శని నడుస్తుందని, ప్రత్యేక పూజలు చేయించుకోవాలని కొందరు ఫన్నీగా రిప్లే ఇస్తున్నారు. ఇప్పటికి అయినా ఈ జ్యోతిష్యాలు మానేసి బుద్దిగా ఉండాలని.. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇకనైనా సైలెంట్ గా ఉంటారో లేదా మళ్లీ ప్రభాస్ మీద జ్యోతిష్యం చెబుతారో చూడాలి.