Veera Dheera Sooran: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథాంశాలను తెరకెక్కించడంలో హీరో విక్రమ్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. కమర్షియల్ సినిమాలని చేయడానికి తను ఎప్పుడు సిద్దం గా ఉండడు. అందుకే ఏదైనా డిఫరెంట్ గా ఉండాలని కోరుకునే ఆయన తన కెరీర్ లో అపరిచితుడు, నాన్న, ఐ లాంటి డిఫరెంట్ తరహా సినిమాలను చేస్తూ వచ్చాడు.
ఇక ఇప్పుడు కూడా ‘తంగలాన్ ‘ అనే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఇది సెట్స్ మీద ఉండగానే మరొక ప్రాజెక్ట్ ని కూడా తను లైన్ లో పెట్టాడు. సిద్ధార్థ్ తో ‘చిన్న’ మూవీ ని తీసి మంచి విజయాన్ని అందుకున్న ఎస్ యు అరుణ్ కుమార్ డైరెక్షన్ లో తను “వీర ధీర శూరన్” అనే సినిమాని చేస్తున్నాడు. ఇక విక్రమ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు.అయితే ఈ టీజర్ ను చూస్తే విక్రమ్ మరొక డిఫరెంట్ క్యారెక్టర్ లో ఈ సినిమాలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.
తను ఏదో ఒక పెద్ద వ్యవస్థ నుంచి తప్పించుకొని వచ్చి ఇక్కడ ఒక కిరాణం కొట్టు పెట్టుకుని సాధారణ మనిషిలాగా బతుకుతున్నవాడిలాగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో విక్రమ్ ను చూస్తే ఆయన గన్ పట్టుకొని కాల్చిన విధానాన్ని గాని చూస్తే ఈ సినిమా లో విక్రమ్ షార్క్ షూటర్ పాత్ర ను పోషించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన మొత్తం స్టోరీ అంతా ఫ్లాష్ బ్యాక్ లో ఉండబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
మరి ఇలాంటి క్రమంలో ఆయన ఈ సినిమా పట్ల చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా రజినీకాంత్ భాష సినిమాను పోలి ఉండబోతుంది ఈ సినిమా ప్లాట్ పాయింట్ అలాగే కనిపిస్తుంది అంటూ సోషల్ మీడియా లో ఈ సినిమా గురించి విపరీతంగా కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుంది అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…