https://oktelugu.com/

Prabhas: ప్రభాస్ కి ప్లాప్ వచ్చిన, ఫ్రస్టేషన్ వచ్చిన ఏం చేస్తాడో తెలిస్తే షాక్ అవుతారు..?

చిన్నప్పటి నుంచి ఆయన ఎప్పుడు డిప్రెషన్ లో ఉన్న ఇలానే చేసుకుంటూ వస్తానని ఒక ఇంటర్వ్యూలో తను తెలియజేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Written By:
  • Gopi
  • , Updated On : April 19, 2024 10:01 am
    Prabhas

    Prabhas

    Follow us on

    Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ప్రస్తుతం తనదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక బాహుబలి సినిమాతో వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ ని వాడుకుంటూ ఇప్పుడు తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ మంచి గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

    ఇక ఇప్పటివరకైతే ప్రభాస్ ని ఢీకొట్టే హీరో ఇండియాలో లేడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ కి హిట్ వస్తే తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుంటాడట. ఒక సినిమా ఫ్లాప్ అయిన లేదంటే, తను కొంచెం డిప్రెషన్ లో ఉన్నా కూడా ఏం చేస్తాడు అనే విషయం మనలో చాలామందికి తెలియదు. అయితే ప్రభాస్ మాత్రం తనకి ఏ కొంచెం డిస్టబెన్స్ గా ఉన్నా, లేదా మూడు ఆఫ్ లో ఉన్నా కూడా ఎవర్నీ కలవకుండా, ఎటు వెళ్లకుండా ఫుల్లుగా తినేసి ప్రశాంతంగా పడుకుంటాడట. ఇక తను ఏదైతే డిప్రెషన్ గాని, బాధలో గాని ఉన్నాడో నిద్ర నుంచి లేచిన తర్వాత ఆ బాధ మొత్తాన్ని మర్చిపోయి మళ్ళీ ఫ్రెష్ గా లైఫ్ ని లీడ్ చేస్తూ ముందుకెళ్తాడట.

    ఇక చిన్నప్పటి నుంచి ఆయన ఎప్పుడు డిప్రెషన్ లో ఉన్న ఇలానే చేసుకుంటూ వస్తానని ఒక ఇంటర్వ్యూలో తను తెలియజేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక మొత్తానికైతే ప్రస్తుతం ప్రభాస్ తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఇండస్ట్రీలో ముందుకెళ్తున్నాడు. ఇక ఈ సంవత్సరం కల్కి, రాజసాబ్ అనే రెండు సినిమాలను రిలీజ్ చేసి ఇండియాలో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు…

    ఇక ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్, హను రాఘవపూడి డైరెక్షన్ లో మరొక సినిమా చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ప్రభాస్ కోసం పడి చచ్చిపోయే అభిమానులు తెలుగు లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పుష్కలంగా ఉన్నారు…