Balakrishna: నందమూరి నటసింహం తన నెక్స్ట్ మూవీలో ఓ హీరోయిన్ ని తీసుకోవాలని పట్టుబడుతున్నాడట. ఆమె ఫేడ్ అవుట్ అయ్యింది. మరొకరిని తీసుకుందామని దర్శకుడు సూచిస్తున్నా వినడం లేదట. ఆమెనే ఫిక్స్ చేయమని అల్టిమేటం జారీ చేశాడట. అందుకు కారణం ఇదే అంటూ టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
హీరో బాలకృష్ణ ఫుల్ ఫార్మ్ లో ఉన్నాడు. ఆయన నటించిన చిత్రాలు వరుసగా విజయం సాధించాయి. అఖండ మూవీతో ఆయన సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. 2014లో వచ్చిన లెజెండ్ తర్వాత బాలకృష్ణకు హిట్ లేదంటే అతిశయోక్తి కాదు. బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్స్ డబుల్ డిజాస్టర్స్ అయ్యాయి. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలను జనాలు కనీసం పట్టించుకోలేదు. దీంతో థియేటర్స్ ఎదుట ఫ్రీగా చూడంటి అంటూ బోర్డ్స్ పెట్టారు.
Also Read: భారతీయుడు 2 కలెక్షన్స్ చూస్తే ఆశ్చర్య పోతారు… మరి ఇంత తక్కువేంటి స్వామి
అనంతరం విడుదలైన రూలర్ కూడా అదే బాట పట్టింది. వరల్డ్ వైడ్ ఆ మూవీ 10 కోట్లు వసూలు చేయలేకపోయింది. బాలకృష్ణ మార్కెట్ ఊహించని స్థాయిలో పడిపోయింది. ఇక బాలయ్య పని అయిపోయింది అనుకుంటున్న తరుణంలో బోయపాటి శ్రీను అఖండ మూవీతో ఊపిరి పోశాడు. కీలక సమయంలో బాలకృష్ణకు హిట్ ఇచ్చాడు. 2021లో విడుదలైన అఖండ వంద కోట్ల వసూళ్ల వరకు రాబట్టింది. భారీ లాభాలు పంచింది.
కాగా చిత్రానికి ఇటీవల సీక్వెల్ ప్రకటించారు. అఖండ 2 త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. బోయపాటి శ్రీను స్క్రిప్ట్ పూర్తి చేశాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా అఖండ 2 షూటింగ్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో యూనిట్ సభ్యులు ఉన్నారు. ఈ క్రమంలో దర్శకుడు బోయపాటి శ్రీను నటీనటుల ఎంపిక పనిలో ఉన్నారు. అఖండ మూవీలో నటించిన చాలా మంది నటులు అఖండ 2లో ఉంటారని సమాచారం.
అయితే హీరోయిన్ ని మారుద్దామని బోయపాటి శ్రీను భావించారట. అఖండ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ బాలయ్యతో జతకట్టిన సంగతి తెలిసిందే . ప్రస్తుతం ఆమె ఫార్మ్ లో లేదు. చెప్పాలంటే ఫేడ్ అవుట్ అయిపోయింది. జనాల్లో ఆమెకు ఎలాంటి క్రేజ్ లేదు. భారీ బడ్జెట్ మూవీ కావడంతో ప్రగ్యా జైస్వాల్ ని తీసుకోవడం కరెక్ట్ కాదని బోయపాటి ఆలోచన అట. కానీ బాలయ్య ఆమెనే కావాలని పట్టుబట్టారట. హీరోయిన్ ని మార్చొద్దు. ప్రగ్యా జైస్వాల్ నే ఎంపిక చేయమని ఆర్డర్ వేశాడట.
ఈ మేరకు ఓ న్యూస్ టాలీవుడ్ లో వైరల్ అవుతుంది. ఫేడ్ అవుట్ హీరోయిన్ నే కావాలని బాలకృష్ణ ఎందుకు పట్టుబట్టారనే చర్చ మొదలైంది. దానికి కారణం… బాలకృష్ణకు సెంటిమెంట్స్ ఎక్కువ. దేవుళ్ళు, సాంప్రదాయాలతో పాటు కొన్ని సెంటిమెంట్స్ ని ఆయన గట్టిగా నమ్ముతారు. అందుకే బాలయ్య అఖండ 2లో కూడా ప్రగ్యా జైస్వాల్ ఉండాలని కోరుకుంటున్నారట. ప్రగ్యా జైస్వాల్ అఖండ 2 లో నటించడం వలన మరలా హిట్ దక్కుతుంది అనేది ఆయన భావన అనే వాదన తెరపైకి వచ్చింది.
ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు బాబీతో 109వ చిత్రం చేస్తున్నాడు. టైటిల్ నిర్ణయించాల్సి ఉంది. ఈ మూవీ టీజర్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇది పీరియాడిక్ యాక్షన్ డ్రామా అనిపిస్తుంది. ఈ చిత్రంలో బాలయ్యకు జంటగా ఊర్వశి రాతెలా, చాందిని చౌదరీ నటిస్తున్నారు. ఇటీవల సెట్స్ లో ఊర్వశి రాతెలాకు గాయమైనట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: కాంతారావు 400 ఎకరాలు సంపాదించాడు కానీ ఏం లాభం…చివరి క్షణాలు అలా ముగిసిపోయాయి…
Web Title: Interesting update about balakrishna akhanda 2 movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com