Coolie Collection Day 8: సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) నటించిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ'(Coolie Movie) భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండి డివైడ్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునేందుకు నానా తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ బ్రేక్ ఈవెన్ అయినా, అవ్వకపోయిన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా తేలికగా బ్రేక్ ఈవెన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ నిన్న వచ్చిన వసూళ్లను చూసి బయ్యర్స్ కి నోటి నుండి మాట రాలేదు. 7 వ రోజు వచ్చిన వసూళ్లతో పోలిస్తే 8వ రోజు 50 శాతం కి పైగా వసూళ్లు డ్రాప్ అయ్యాయి. 7వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 54 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 8వ రోజున కేవలం 26 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది ఈ చిత్రం.
Also Read: అకిరా నందన్ ను పరిచయం చేసే బాధ్యతను ఆ దర్శకుడికి అప్పజెప్పిన పవన్ కళ్యాణ్
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు 39 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 46 కోట్ల రూపాయలకు జరిగింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి క్లీన్ సూపర్ హిట్ స్టేటస్ ని అందుకోవాలంటే మరో 7 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి. ఈ వీకెండ్ మీదనే బయ్యర్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ వీకెండ్ తో కచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని ఆశపడుతున్నారు. మరి అది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి. ఇక ఇతర బాషల విషయానికి వస్తే తమిళనాడు లో ఈ చిత్రం ఇప్పటి వరకు 116 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మొదటి వీకెండ్ తర్వాత ఈ ప్రాంతం లో ఈ చిత్రానికి నమోదు అవుతున్న వసూళ్లను చూసి ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
ఎందుకంటే అవి బ్రేక్ ఈవెన్ అవ్వడానికి అసలు ఏ మాత్రం సరిపోని వసూళ్లు అన్నమాట. ఈ ప్రాంతం లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా 240 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావాలి. కానీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే కేవలం 180 కోట్ల రూపాయిల వరకే ఈ చిత్రం రీచ్ అయ్యేట్టు అనిపిస్తుంది. కానీ రెండవ భారీ వీకెండ్ తర్వాత వినాయక చవితి లాంటి పెద్ద పండగ ఉండడంతో, కచ్చితంగా ఆ రోజున ప్రస్తుతం నమోదు అవుతున్న వసూళ్లకంటే మూడింతలు ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్ గా ఈ చిత్రానికి ఇప్పటి వరకు 452 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 225 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా 81 కోట్ల రూపాయిల షేర్ ని ఈ అదనంగా ఈ చిత్రం రాబట్టాల్సి ఉంది.