https://oktelugu.com/

Old Age: వృద్ధాప్యంలో కూడా ఇవి చేయాల్సిందే..

వ్యాయామం చేయడం అసలు మానేయకూడదు. వాకింగ్, స్విమ్మింగ్, యోగా వంటివి చేయడం వల్ల కండరాలు బలంగా ఉంటాయి. ఆరోగ్యంగా కూడా ఉంటారు.

Written By:
  • Gopi
  • , Updated On : June 23, 2024 3:33 pm
    Old Age

    Old Age

    Follow us on

    Old Age: వృద్ధాప్యం వచ్చిన తర్వాత కేవలం కూర్చోవడం మాత్రమే చేస్తుంటారు చాలా మంది. కానీ శరీరానికి, మెదడుకు పూర్తిగా విశ్రాంతి ఇవ్వకూడదట. మరి దీని కోసం ఏం చేయాలంటే..

    వ్యాయామం చేయడం అసలు మానేయకూడదు. వాకింగ్, స్విమ్మింగ్, యోగా వంటివి చేయడం వల్ల కండరాలు బలంగా ఉంటాయి. ఆరోగ్యంగా కూడా ఉంటారు.

    కూరగాయలు, ఫ్రూట్స్ కచ్చితంగా తినాలి. ప్రోటీన్, విటమిన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇలాంటివి తినడం వల్ల వయసుతో పెరిగే కొద్దీ వచ్చే డయాబెటిస్, గుండె సమస్యల నుంచి కాస్త దూరంగా ఉండవచ్చు.

    బ్రెయిన్ చురుగ్గా ఉండటానికి మెదడుకు మేత పెట్టే ఆటలు ఆడుతుండాలి. పజిల్స్, కొత్త స్కిల్స్ నేర్పే ఆటలు వంటివి ఉంటాయి. కొన్ని బాడీ కోసం కూడా ఆడే గేమ్స్ ఉంటాయి. సో ఆడుతుండండి..

    క్లబ్స్, కమ్యూనిటీ గ్రూప్స్ , ఫ్రెండ్స్, ఫ్యామిలీ తో సమయాన్ని కేటాయిస్తూ ఉండాలి. అందరితో కలుస్తూ హాయిగా నవ్వుతూ హెల్దీ ఆక్టివిటీస్ చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల ఆనందంగా ఉంటారు.

    ఎప్పటికప్పుడు మీ ఆరోగ్యాన్ని చెక్ చేయిస్తూ ఉండాలి. బీపీ, షుగర్ వంటివి ఉంటే కచ్చితంగా చెకప్స్ చేసుకోవాలి. కొలెస్ట్రాల్, క్యాన్సర్ వంటివి వయసు పెరుగుతున్న కొద్ది వచ్చే సమస్యలు సో జాగ్రత్త.

    ఏడు నుంచి 9 గంటల నిద్ర చాలా అవసరం. ఈ సమయంలో సోషల్ మీడియాలో బిజీగా ఉండటం. లేదా ఏవైనా గుర్తు చేసుకుంటూ బాధ పడటం వంటివి చేస్తూ సమయాన్ని హృదా చేయకూడదు.

    వీలైనంతగా ఒత్తిడికి దూరంగా ఉండండి. మీకు ఒత్తిడిగా అనిపించే విషయాలను పిల్లలతో మాట్లాడి వెంటనే క్లియర్ చేసుకోండి. కానీ 60 దాటిన తర్వాత కూడా ఒత్తిడితో ఉండటం మంచిది కాదు.